Home /News /andhra-pradesh /

SRIKAKULAM ANDHRA PRADESH CRIME NEWS RAPE IN VIZIANAGARAM BUT POLICES HAVE SOMG DOUBTS ON COMPLIANT NGS VZM

AP Crime News: అర్థరాత్రి తలుపుతట్టి.. ఒంటరి మహిళపై అఘాయిత్యం.. అసలు ఏం జరిగిందంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Crime News: ఆంధ్రప్రదేశ్ కు ఏమైంది..? మానవ మృగాలు ఎందుకు రెచ్చిపోతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుస అత్యాచారాలు కలకలం రేపుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి వార్తలు వినాల్సి వస్తోంది. తాజాగా ఓ ఒంటరి మహిళపై దుండగులు అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది.

ఇంకా చదవండి ...
    AP Crime News:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. నిత్యం ఎక్కడొ ఒక చోట ఇలాంటి వార్తలు వినాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈ మధ్య మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఒక ఘటన వెంట మరో ఘటన షాకిస్తోంది. తాజాగా విజయనగరం (Vizianagaram) పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న మహిళపై ఓ దుండగుడు అర్ధరాత్రి అత్యాచారానికి (Rape) పాల్పడ్డాడు. బాధిత మహిళ ఉపాధి కోసం పార్వతీపురం మన్యం జిల్లా (Paravatipuram Manyam District) నుంచి విజయనగరం పట్టణానికి వచ్చి స్దానిక రైతు బజార్ వద్ద ఉన్న ఓ టీ దుకాణంలో పనిచేస్తోంది. సోమవారం అర్ధరాత్రి ఆమె ఇంటి తలుపుకొట్టిన దుండగుడు. తలుపు తీయగానే బలవంతంగా లోనికి చొరబడి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో .. నిందితుడు సహా ఇద్దరు స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    మహిళ అత్యాచారానికి గురైందన్న విషయం స్థానికంగా కలకలం రేపింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతం ఉలిక్కి పడింది. స్దానిక ఉడా కాలనీ ఫేజ్-3 లో తన ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్న ఓ మహిళ .. రైతు బజార్ వద్ద ఉన్న ఓ టీ దుకాణంలో పనిచేస్తూ, తన జీవనం కొనసాగిస్తోంది. ఆ క్రమంలో పరిచయమైన ఓ యువకుడు తన స్నేహితులను తీసుకొని బాధిత మహిళ ఇంటికి వెళ్లాడు. గత రాత్రి ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంట్లోకి బలవంతంగా చొరబడిన నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

    ఇదీ చదవండి : పిట్ట కొంచెం కూత ఘనం.. ఐదేళ్లకే ఊహించని సాహసం.. మెగా పవర్ స్టారే స్ఫూర్తి

    అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి కూడా కొన్నాళ్లుగా ఆమెకు బాగా తెలిసిన వ్యక్తే.. తన స్నేహితులతో ఇంట్లోకి వచ్చిన వ్యక్తి.. అతని స్నేహితుల ముందే బాధితురాలిని అత్యాచారం చేయడంతో.. బాధిత మహిళ , వెంటనే రాత్రి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన వన్ టౌన్ పోలీసులు.. బాధిత మహిళను విచారించి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి సహా అతని స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అత్యాచారం కేసు కావడంతో.. కేసును దిశా పోలీస్ స్టేషన్ కు అప్పచెప్పారు. బాధిత మహిళను మహారాజా ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు పంపించారు.

    ఇదీ చదవండి : : ఈయన గోల్డ్ హే.. అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న బాబు బంగారం.. అమ్మ మాటే ఇలా మార్చేసిందా?

    మహిళ ఫిర్యాదులో కొన్ని అనుమానాలు ఉన్నాయి అంటున్నారు జిల్లా ఎస్పీ ఎం.దీపిక. అత్యాచారం చేసినట్టు చెబుతున్నసమయంలో.. ఆమెతో పాటు ఇంటిలో మరో స్నేహితుడు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లుగా తేలింది అన్నారు. అలాగే ఆమె ఫిర్యాదుపై విచారణ చేస్తున్నప్పుడు
    పిల్లలు చెప్పిన విషయాలకు, ఆమె చెబుతున్నదానికి కాస్త వ్యత్యాసం ఉంది అంటున్నారు. పిల్లలు కేవలం కొట్టినట్లుగా మాత్రమే చెబుతున్నారన్నారని.. సంఘటనా స్థలంలో అత్యాచారం జరిగిన దాఖలాలు కనిపించలేదని అన్నారు. అయినా మహిళ ఫిర్యాదు మేరకు.. సంఘటనా స్థలం నుండి సేకరించిన కొన్ని వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామన్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాతనే ఆరోపణల్లో వాస్తవాలు
    పూర్తిగా తేలుతాయి అన్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, RAPE, Vizianagaram

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు