Home /News /andhra-pradesh /

SRIKAKULAM ANDHRA PRADESH CRIME NEWS ONE MOTHER GAVE INSECTICIDE FOR HER CHILDREN AND END THEIR LIFE NGS VZM

Minster Turned a Doctor: డాక్టర్ గా మారిన మంత్రి.. పరామర్శకు వెళ్లి వైద్యం చేసిన అప్పల రాజు

శ్రీకాకుళం జిల్లాలో దారుణం

శ్రీకాకుళం జిల్లాలో దారుణం

Doctor Appala Raju: ఆయన ఒక మంత్రి.. జగన్ కేబినెట్ లో రెండో ఛాన్స్ దక్కించుకున్న మంత్రి కూడా.. అలాంటి ఆయన ఆత్మహత్యాయత్నం చేసిన బాధితులను పరామర్శించేందుకు వెళ్లి.. డాక్టర్ అవతారమెత్తారు.

    Doctor Minster Appalaraju: చిన్న చిన్న సమస్యలు.. క్షణికావేశానికి కొందరు అతి పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా శ్రీకాకుళం  జిల్లా పలాస మండలం లో దారుణం చోటు చేసుకుంది.  ఓ తల్లి పురుగుల మందు తన ఇద్దరు పిల్లలకు తాగించి..  తాను కూడా తాగి  ఆత్మహత్యకు ప్రయత్నించింది.  జీడి తోటకు కొట్టే పురుగుల మందును తాగి తన ఇరువురి పిల్లలకు తాగించి  ఆత్మహత్యా యత్నం చేసుకుంది 32 ఏళ్ల బొడ్డపాడు గ్రామానికి చెందిన దీప  అనే వివాహిత. ప్రస్తుతం  పలాస ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వివాహిత తన ఇద్దరు పిల్లల పరిస్థితి విషమం కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు భావిస్తున్నారు పోలీసులు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి వారికి వైద్యం చేశారు.

    ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను, పిల్లల్లను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి,  వైద్యం అందించారు  మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజు.. మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
    శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భర్తతో కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి, తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

    ఇదీ చదవండి : సిల్వర్ స్క్రీన్ పై చంద్రబాబు దత్తపుత్రుడి సినిమా.. హీరోయిన్లు ఎంతమంది అంటే..?

    భర్త తో విబేధాల కారణంగా తీవ్ర మనస్థానికి గురై ఆమె.. జీడి తోటకు కొట్టే పురుగుల మందును తాగి తన ఇరువురి పిల్లలకు ఆకాష్, నక్షత్రలకు కూడా పురుగుల తాగించి ఆత్మహత్యా యత్నం చేసింది.  తన ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో.. కుటుంబ సభ్యులు, స్ధానికులు ముగ్గురిని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించించారు. ఇక స్ధానికంగానే ఉన్న స్ధానిక మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజు.. కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసి మహిళను, పిల్లల్లను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వ్ళత్తిరీత్యా డాక్టర్ అయిన మంత్రి అప్పలరాజు.. ఆసుపత్రిలో అడుగుపెట్టగానే డాక్టర్ గా మారిపోయారు. పిల్లలను, తల్లి స్టెతస్కోప్ తో పరిశీలించి.. మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులకు ఆదేశించారు.

    ఇదీ చదవండి : అనుభవించు రాజా.. అశ్వాలు, గజరాజులకు షవర్ బాత్.. ఎలా ఎంజాయ్ చేస్తున్నాయంటే?

    వైద్యుడిగా మారడంతో ఇతర బాధితులకు చికిత్స చేశారు. ఆసుపత్రికి వచ్చిన మరికొందరు పేషెంట్ల బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
    మంత్రిగా సేవలు అందిస్తున్నప్పటికీ, తాను ఎంచుకున్న డాక్టర్ వృత్తి కనుక ఆసుపత్రిలో అడుగుపెట్టగానే మళ్లీ డాక్టర్‌గా మారిపోయారు సీదిరి అప్పలరాజు.

    ఇదీ చదవండి :  చంద్రబాబు కోసమే పవన్ పని చేస్తున్నారా? కాంగ్రెస్ తో వైసీపీ పొత్తు పెట్టుకుంటోందా..? మంత్రి కామెంట్

    పేషెంట్లకు చికిత్స అందించడంతో పాటు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తల్లి, ఇద్దరు పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. కుటుంబ కలహాలు కారణంగా తాను చనిపోవాలనుకోవడంతో పాటు పిల్లలను సైతం వెంట తీసుకెళ్లాలని దీప భావించింది. ఈ పని చేసినందుకుగానూ ఆమెపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Srikakulam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు