SRIKAKULAM ANDHRA PRADESH CRIME NEWS ONE MARRIED WOMAN SUICIDE WITCH CHILDREN S IN SRIKAKULAM NGS VZM
AP Crime News: అమ్మ మనసు ఎంత క్షోభించిందో? పాపం చిన్నారులు ఎలా ఉన్నారో? విషాదం నింపిన వివాదం
భర్తపై కోపంతో వివాహిత పిల్లలతో సహా ఆత్య
హత్య
AP Crime News: అయ్యో పాపం అభం శుభం తెలియన ఆ చిన్నారులు ఏం చేశారు.. ఆ అమ్మ మనసు ఎంత క్షోభ పడిందో.. తనతో పాటు.. చిన్నారులను కూడా తీసుకుని పరలోకానికి వెళ్లిపోయింది.. భార్యభర్తల మధ్య విబేధాలు.. ఆ కుటుంబం మొత్తం బలైంది..
AP Crime News: భార్య భర్తలు (Husband and Wife) అన్యోన్యంగా ఉంటేనే సంసారం సాఫీగా సాగుతుంది. పిల్లలు సంతోషంగా ఉంటారు.. ఇద్దరి మధ్య విబేధాలు ఉంటే.. అభం శుభం తెలియని చిన్నారులు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. తప్పు ఎవరు చేసినా.. శిక్ష పిల్లలకు పడుతుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. అయినా తల్లిదండ్రుల్లో మార్పు రావడం లేదు.. భర్త (Husband) తో విబేధాలు ఉన్నాయని భార్య(Wife).. లేదా భార్య తప్పు చేసిందని భర్త.. ఇద్దరు విచక్షణ కోల్పోయి.. తమతో పాటు చిన్నారుల ప్రాణాలను కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఘటన మరొకటి విషాదం నింపింది. భర్తతో విబేధాలు ఉన్నాయనే కారణంతో ఆ భార్య.. తన పిల్లలపై పెట్రోల్ పోసి.. తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో వివాహిత మృతి చెందగా.. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది..
శ్రీకాకుళం జిల్లా (Srikakulam) లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. భర్తతో విబేధాల కారణంగా ఓ వివాహిత దారుణానికి ఒడిగట్టింది. తన ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకొని ఆత్మహత్య (Suicide) కు పాల్పడడమే కాక తన ఇద్దరు పిల్లలపై కూడా తనతో పాటే ఒంటిపైన పెట్రోల్ పోసింది. తను లేకుండా ఆ పిల్లలు బతకలేరని భావించిందో..? లేక భర్తపై కోపం పిల్లలపై చూపించిందో.. కారణం ఏదైనా ఆ అమ్మ మనసుకే తెలియాలి.
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం యలమంచిలిలో ఈ దారుణ ఘటన జరిగింది. జలుమూరు మండలం యలమంచిలి గ్రామానికి చెందిన నరసింహమూర్తి, చిన్నామణి దంపతులు. వీరికి శ్రీరంజని, జాహ్నవి అనే ఇద్దరు కుమార్తెలు, వెంకట సాయి శశాంక్ అనే కుమారుడు ఉన్నారు. భార్యాభర్తలైన చిన్నామణి, నరసింహమూర్తి గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. గత కొంత కాలంగా వీరి మధ్య ఏర్పడ్డ కుటుంబ కలహాల వల్ల భర్త ఇంట్లో లేని సమయంలో.. ఉదయం 6 గంటలకు చిన్నామణి ముందు తన పైన పెట్రోల్ పోసుకొని, తరువాత తన ముగ్గురు పిల్లలపైనా పెట్రోల్ పోసి నిప్పంటించింది.
చిన్నామణి అక్కడికక్కడే మృతి చెందగా రెండో కుమార్తె జాహ్నవి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పెద్ద కుమార్తె శ్రీరంజని, కుమారుడు వెంకట సాయి శశాంక్ కు 80 శాతం గాయాలయ్యాయి.
పెట్రోల్ పోసి నిప్పంటించుకొన్న సమయంలో కేకలు వినిపించడంతో.. ఇరుగు పొరుగు వారు.. మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే 108 లో శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.