AP Crime News: చిన్న చిన్న కారణాలకే విద్యార్ధులు (Students) పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు.. తల్లిదండ్రులకు (Parents) తీరని విషాదం మిగులుస్తున్నారు. నిండు నూరేళ్ల భవిష్యత్తును మధ్యలోనే ముగించేస్తున్నారు. బంగారు భవిష్యత్తు ఉంటుందని కలలు కంటుున్న తల్లితండ్రులను శోక సంద్రంలో ముంచుతున్నారు. చదువు ఒత్తిడి అని.. పరీక్షల్లో పాస్ అవ్వలేదని.. స్నేహితులు (Friends) తిట్టారని.. ప్రేమ విఫలమైందని (Love Failure) .. తల్లిదండ్రులు మందలించారని.. ఫోన్ కొనివ్వలేదని.. ఇలా చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు (Suicide) చేసుకోవడం కలకలం రేపుతోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) ఎచ్చెర్ల గురుకుల పాఠశాలలో ఓ ఇంటర్మీడియట్ ఫస్టియర్ (Inter 1st Year) విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది.
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మన్నపేటకు చెందిన 17 ఏళ్ల దుంగ కరిష్మా (Dunga Karshma).. బాలయోగి (Balayogi) గురుకులంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అయితే కొన్ని నెలలుగా భవాని అనే పాఠశాల ఉపాధ్యాయురాలి దగ్గర కారు డ్రైవర్ (Car Driver) గా పనిచేసే సురేష్‌తో కరిష్మాకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే ఈ ప్రేమ వ్యవహారం ఉపాధ్యాయురాలు భవానీకి తెలియడం, తన ఉద్యోగానికి ఇబ్బంది అవుతుందని భావించి, సురేష్‌ను డ్రైవర్‌గా తొలగించారు.
ఇదీ చదవండి : టెన్త్ పేపర్ లీక్ వెనుక సంచలన నిజాలు.. ఇదంతా వాళ్ల పనే..!
విద్యార్దిని కరిష్మాను కూడా ఇలాంటి వ్యవహారాలు స్కూల్ లో ఏంటంటూ మందలించినట్టు తెలుస్తోంది. అలా మందలించారన్న విషయం .. తోటి విద్యార్థులకు తెలిసిపోయిందన్న మనస్తాపంతో కరిష్మా తరగతి గదిలోనే ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుంది. స్టడీ అవర్స్ కోసం విద్యార్థులు తరగతి గదికి వచ్చేసరికి కరిష్మా మృతదేహం ఫ్యానుకు వేలాడుతూ ఉండటంతో .. విద్యార్ధులు ప్రిన్సిపల్‌కు సమాచారం అందించారు.
ఇదీ చదవండి : పిట్ట కొంచెం కూత ఘనం.. ఐదేళ్లకే ఊహించని సాహసం.. మెగా పవర్ స్టారే స్ఫూర్తి
వెంటనే స్కూల్ సిబ్బంది విద్యార్ధిని ఆత్మహత్య విషయం పోలీసులకు అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. తరువాత. కరిష్మా మృత దేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ కి తరలించారు. ఇక తన ఆత్మహత్యకు గురుకులం గానీ, వేరే ఎవరూ గానీ కారణం కాదంటూ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాము వచ్చేవరకూ కూడా తమ కూతురుని ఉంచలేదని, ఈ లోపే ఆస్పత్రికి తరలించడంపై స్కూల్ సిబ్బందితో కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఇంత వ్యవహారం జరిగితే.. తమకు ఆలస్యంగా సమాచారం ఇచ్చారంటూ సిబ్బందిపై మండిపడ్డారు. విద్యార్థిని తండ్రి దుంగ భూలోకం ఫిర్యాదు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాము తెలిపారు.
ఇదీ చదవండి : ఈయన గోల్డ్ హే.. అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న బాబు బంగారం.. అమ్మ మాటే ఇలా మార్చేసిందా?
బాలయోగి గురుకులం విద్యార్థిని కరిష్మా ప్రేమ వ్యవహారం బయట పడడం, ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో.. ఆ ప్రభావం ముగ్గురు టీచర్లపై పడింది. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఉషారాణి, ఇంగ్లీష్ జూనియర్ లెక్చరర్ భవానీ, హౌస్ టీచర్ మంజులను వేటు వేస్తూ.. విధుల నుండి సస్పెండ్ చేస్తూ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త వై.యశోదలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఆత్మహత్య ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమా.. లేక వేరే ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అనే కోణలంలో విచారణ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Srikakulam