ACB Raids: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అవినీతి అధికారుల జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది. వారి సంపద చూసి అధికారులు సైతం షాక్ కు గురవుతున్నారు. ఎన్నిసార్లు తనిఖీలు చేస్తున్నా..? వీరి అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు.. తాజాగా ఓ భారీ అవినీతి తిమింగలం అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ప్లానింగ్ ఆఫీసర్ (Visakha Urban Development Authority Officer ) వర్దనపు శోభన్ బాబు (Vardhanapu Sobhan Babu) పై ఫిర్యాదులు అందడడం.. ఏసీబీ అధికారులు సోదాలు (ACB Rides) నిర్వహించి షాక్ కు గురయ్యారు. తెల్లవారుజాము నుంచే శోభన్ బాబు ఇంట్లో తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. ఇప్పటికే శోభన్ బాబు అక్రమాస్తులపై అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. ఆయనకు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయని గుర్తించారు. విశాఖపట్నం (Visakhapatnam), విజయనగరం (Vizianagaram), శ్రీకాకుళం (Srikakulam) మాత్రమే కాకుండా.. భీమవరంలో కూడా భారీ ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని శోభన్ బాబు బంధువుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు చేసి అక్రమ ఆస్తులు గుర్తించినట్టు తెలుస్తోంది.
శోభన్ బాబు ఇంట్లో జరిపిన సోదాల్లో దాదాపు 8 లక్షల రూపాయలకు పైగా నగదు, భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీగా స్థిరాస్థులను గుర్తించారు. తక్కువ ధరకు భూములు కొనడం.. తరువాత భారీ ధరకు అమ్మడం.. లీగల్ సమస్య ఉన్న భూములను సెటిల్ మెంట్ పేరుతో.. తన సొంత చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
అయితే శోభన్ బాబు అవినీతిపై ఎప్పటి నుంచో ఫిర్యాదులు ఉన్నాయి. సరైన ఆధారాల కోసం ఎదురు చూసిన ఏసీబీ అధికారులు ఎట్టకేలకు అతడి అక్రమాలను వెలుగులోకి తీసుకురాగలిగారు. ముఖ్యంగా విజయనగరం, విశాఖలో ఏళ్ల తరబడి విధులు నిర్వహించిన శోభన్ బాబుకు.. ఇక్కడి మార్కెట్ విలువ.. భూముల వ్యవాహారం అన్ని తెలియడంతో.. రియల్ ఎస్టేట్ వ్యాపారీల కన్నా ఎక్కువ లావా దేవీలు జరిపినట్టు సమాచారం.
ఇదీ చదవండి : టార్గెట్ ఆ ఇద్దరే.. వారికి చెక్ పెట్టేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ.. నేతలకు సీఎం జగన్ దిశా నిర్దేశం
ఎట్టకేలకు అవినీతి బాగోతం ఏసీబీ నిఘాతో బట్టబయలైంది. అయితే ఇంకా బినామీ పేర్లతో భారీగానే ఆస్తులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అపార్టు మెంట్లలో ప్లాట్లు.. భారీ భనవాలు కొనుగోలు చేయడమే కాదు.. పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములు కూడా బినామీల పేరుతో కొన్నట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆయన పేరు మీద ఉన్న భవనాలు, బంగారం, వెండి కొనుగోలు చేసినట్లు తనిఖీల్లో గుర్తించారు అధికారులు. ముఖ్యంగా అరిలోవ బ్యాంక్ లాకర్ ఓపెన్ చేస్తే మరింత బంగారం, నగదు, కీలక డాక్యుమెంట్లు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు ఏసీబీ అధికారులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ACB, Andhra Pradesh, AP News, Crime news, Visakhapatnam