SRIKAKULAM ANDHRA PRADESH CIRME NEWS ONE WIFE PROTEST FOR HER HUSBAND IN SRIKAKULAM DISTRICT NGS VZM
AP Crime new: భర్త వదిలేశాడు.. మరిది వేధిస్తున్నాడు.. అత్తింటిముందు ఆ మహిళ ఏం చేసిందంటే?
భర్త కోసం భార్య పోరాటం
AP Crime News: తన భర్తతో కలిసి జీవించాలన్నది ఆ భార్య ఆరాటం.. అందుకోసం అత్తింటి ముందే పోరాటానికి దిగింది. కాపురం చేస్తూ.. మధ్యలో భర్తను విడదీశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అసలు ఏం జరిగింది..? ఎందుకు భర్త దూరం కావాల్సి వచ్చింది.. ఆమె పోరాటం ఎవరిపైన..?
AP Crime News: శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) పలాస-కాశీబుగ్గ రోటరీ నగర్ కాలనీలో అత్తమామల ఇంటి ముందు ఓ దళిత మహిళ న్యాయ పోరాటానికి దిగింది. తన భర్తను తనకు చూపించాలని నిరసనకు దిగింది. అతడు ఇంట్లోనే ఉన్నా.. ? అత్తమామలు తన భర్త (Husband)ను ఇంట్లోనే బంధించి బయటకు రాకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అత్తా మామాలకు తోడు మరిది కూడా. . చాలా నాటాకాలు ఆడుతున్నారని ఆరోపిస్తోంది. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని పట్టుబడుతూ నిరసనకు దిగింది. పోలీసులే తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది.
పలాసకు చెందిన దళిత మహిళ భాను నాయక్, భర్త సనపల మురళీ క్ళష్ణలు భార్యభర్తలు. ఇద్దరికీ 2010లో హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో పరిచయం అయింది. తర్వాత ప్రేమించుకొని, మూడేళ్లపాటు ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం (Living Releation) చేసారు. ఆ తర్వాత దళిత మహిళ అని చెప్పి వదలి వచ్చేశాడు మురళీ కృష్ణ. మన పెళ్లి ఇంట్లో ఒప్పుకోరని చెప్పి తప్పించుకుందామని చూసాడు. అప్పుడు భాను నాయక్ స్థానిక దళిత నేతలను ఆశ్రయించింది. వాళ్లు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
వీరి పెళ్లికి అత్తింటి వారు ఒప్పుకోక పోవడంతో.. పలాస-కాశీ పోలీస్ స్టేషన్లో 2013లో వీరికి పెళ్లి అయింది. తరువాత రిజిస్ట్రార్ ఆఫీస్ లో కూడా మరోసారి వివాహం చేసుకున్నారు. ఆ వెంటనే ఊరి విడిచి.. హైదరాబాద్ వెళ్లి 8 నెలల పాటు కాపురం చేశారు.. 8 నెలల పాటు వారి సంసారం సాఫీగా.. హ్యాపీగా సాగింది అంటోంది ఆ బాధిత మహిళ.. కానీ ఊరు వెళ్లి వస్తాను అని చెప్పిన తన భర్త.. తనను వదిలేసి వచ్చి.. తిరిగి రాలేదని ఆమె వాపోయింది. కేవలం తన దగ్గర ఉన్న సొమ్ము కాజేసి శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసి నడిరోడ్డుపై వదిలి శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసాడని ఆరోపిస్తోంది. దీంతో అక్కడ చేసేదేం లేక అక్కడినుండి భార్య కూడా తన భర్తను వెతుక్కుంటూ శ్రీకాకుళం జిల్లాలోని తన భర్త ఇంటికి వచ్చింది.
ఆమె ఇక్కడకు వచ్చేసరికి తన భర్త, అత్తమామల ఇంటికి తాళం వేశారని వాపోయింది. 2015లో తన మామ తనకు ఫోన్ చేసి తన భర్తతో మళ్లీ పెళ్లి చేస్తామని చెప్పారని, కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేసానని ఆమె అంటోంది. అయితే తన భర్త తప్పించుకు తిరుగుతున్నా.. తన మరిది, తన భర్త మురళీక్ళష్ణ తమ్ముడైన సనపల హరిక్ళష్ణ తనతో అసభ్యంగా ప్రవర్తించడం, తాకడం వంటి నీచపు పనులకు పాల్పడ్డాడని, ఆ విషయం కూడా తన భర్త మురళీక్ళష్ణ కు చెప్పానని అయినా పట్టించుకోలేదని వాపోతుంది. తన మరిది ప్రస్తుతం వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడని ఆమె ఆరోపణలు చేసింది.
తన భర్త ఎన్ని చిత్రహింసలకు పెట్టినా ఎప్పటికైనా మారతాడని అలానే ఓపిక పట్టాను. హైదరాబాద్ లో రెంట్ కు ఉన్న ఇంట్లో నన్ను వదిలి పెట్టి పారిపోయాడు. 15 రోజులు ఎక్కడున్నడో తెలియలేదని. తర్వాత రోటరీ కాలనీకి వస్తే అత్తమామ, మరిదిని వేరే చోటికి పంపేశారని ఆదేవన వ్యక్తం చేసింది. అప్పటినుండీ తనకు దొరకలేదని, ప్రస్తుతం అత్తమామలతో కలిసి నివసిస్తున్నాడని తెలిసిందని భాను నాయక్ అంటోంది. తనకు న్యాయం చేయలాని.. తన మరిది కూడా మాటలతో హింసించేవాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. 2020 డిసెంబర్ లో కూడా తన భర్తతో మరోసారి వివాహం చేసుకుంటామని చెప్పి.. చెప్పిన రోజే మరలా కుదరదని చెప్పడం, ఆ రోజు నుండి నేటి వరకూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. తన భర్తను తిరగి తనకు అప్పగించాలని పోలీసులను కోరుతోంది. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని పోలీసులను, అధికారులను డిమాండ్ చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.