Manchu Lakshmi: మంచులక్షి (Manch Lakshmi) కి ప్రత్యేక గుర్తింపు ఉంది. సోషల్ మీడియా (Social Media) లో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. అయితే లక్ష్మి ఏం మాట్లాడినా..? ఏం చేసినా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అందుకే ఆమెకు అంత క్రేజ్.. అయితే తాజాగా ఆమె.. శ్రీకాకుళం (Srikakulam) లో సందడి చేశారు. అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు ఆమె. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావులు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. తన తండ్రి డాక్టర్ మోహన్‌బాబు (Mohanbabu) సూచన మేరకు.. అరసవల్లి క్షేత్రానికి వచ్చాను అన్నారు. నాన్న చెప్పినట్టే అద్భుతంగా స్వామి దర్శనం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ‘టీచ్ ఫర్ ఛేంజ్’అనే ఎన్జీవో తరఫున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 475 ప్రభు త్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాసులు నిర్వహిస్తున్నామని, తద్వారా విద్యార్థులకు ఇంగ్లిష్‌ను నాణ్యంగా బోధించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
స్థానిక జిల్లాలో కొరసవాడ ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ క్లాసులను ప్రారంభించేందుకు తాను జిల్లాకు వచ్చినట్టు ఆమె వివరించారు. అలాగే మరోవైపు నటనను కొనసాగిస్తున్నానని, త్వరలోనే ‘లేచింది మహిళా లోకం’ అనే పూర్తి మహిళల చిత్రం విడుదల కానుందని, అలాగే తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి కుటుంబకథా చిత్రాన్ని కూడా చేయనున్నానని ఆమె ప్రకటించారు.
తాజాగా ఆమె కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3 లక్షల రూపాయలతో స్మార్ట్ క్లాస్‌రూంను మంచు లక్ష్మి ప్రారంభించారు. ఆమె ముందుగా ఓపెన్ టాప్ జీపులో కొరసవాడ చేరుకున్నారు. ఊరివారితో పాటు సమీప గ్రామస్తులు కూడా ఆమెను చూడడానికి పోటెత్తారు.
ఇదీ చదవండి : బీసీలంతా వైసీపీ వైపే.. టీడీపీ హయాంలో వారికి తీవ్ర అన్యాయం
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని 20 పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
తొలిసారి తమ గ్రామానికి వచ్చిన మంచులక్ష్మిని చూసేందుకు ప్రజలు భారీగా ఎగబడ్డారు. వారంతా లక్ష్మితో కలిసి సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. గ్రామస్తుల తనన ఆధరించిన తీరుకు ఆనందం వ్యక్తం చేశారు మంచు లక్ష్మి.. శ్రీకాకుళంలో తమ కార్యక్రమానికి మంచి ఆదరణ వచ్చిందని.. ఈ స్ఫూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Lakshmi manchu, Srikakulam