జగన్ కి శ్రీ రెడ్డి సపోర్ట్... వైసీపీ లోకి ఎంట్రీ..? మరో రోజా అవుతారా..?

వైఎస్ జగన్, శ్రీ రెడ్డి (Images : Facebook)

AP Assembly Election 2019 : కాస్టింగ్ కౌచ్ వివాదంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రీరెడ్డి... రాజకీయాల్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

  • Share this:
Sri Reddy Politics : టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌ సమస్యపై తనదైన పోరాటం చేసి, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీ రెడ్డి. ఆమెకు ఎంతలా అభిమానులు ఉన్నారో, అంతలా ఆమెను వ్యతిరేకించేవారూ ఉన్నారు. కారణం ఆమె చేసే వివాదాస్పద చర్యలు, దూకుడుగా మాట్లాడే నైజం కావచ్చు. ఏది ఏమైనా శ్రీ రెడ్డి ఓ సంచలనం అనే చెప్పాలి. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తూ... వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. అంతేకాదు... వాళ్లూ వీళ్లూ అని తేడా లేకుండా... తన ప్రత్యర్థులందర్నీ వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడుతూ... సోషల్ మీడియా ట్రెండింగ్‌లో కనిపిస్తోంది. ఈమధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన అన్నయ్య నాగబాబుపై కూడా ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది ఈ బ్యూటీ. తాజాగా ఆమె వైసీపీలోకి ఎంట్రీ ఇస్తుందన్న వార్తొకటి హల్ చల్ చేస్తోంది. ఆల్రెడీ నటి, ఎమ్మెల్యే, జబర్దస్త్ జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా... వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు శ్రీ రెడ్డి కూడా ఆ పార్టీలో చేరితే, మరో ఫైర్ బ్రాండ్ అవుతుందన్న వాదన వినిపిస్తోంది.

జగన్‌కి ఫుల్ సపోర్ట్ : ఫేస్‌బుక్‌లో 60 లక్షల మందికి పైగా ఫాలోయర్లను సంపాదించుకున్న శ్రీ రెడ్డి రాజకీయాల్లోకి వెళ్తే కచ్చితంగా సెన్సేషనే అవుతుందంటున్నారు విశ్లేషకులు. అందుకు తగ్గట్టుగానే ఆమె... వైసీపీ అధినేత జగన్‌కి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. అందుకు సాక్ష్యంగా... తన చేతిపై జగన్ అనే పేరును గోరింటాకుతో వేయించుకుంది. తద్వారా వైసీపీలోకి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పరోక్ష సంకేతాలు ఇచ్చిందంటున్నారు విశ్లేషకులు.

sri reddy, srireddy, casting couch, jabardasth roja, jabardast, ap assembly election, ap assembly elections, ap assembly election 2019, ap assembly elections 2019, lok sabha election, lok sabha elections, lok sabha election 2019, lok sabha elections 2019, chandrababu, tdp, ys jagan, ycp, pawan kalyan, nagababu janasena, exit polls, poll results, survey, శ్రీ రెడ్డి, శ్రీరెడ్డి, రోజా, జబర్దస్త్, ఫైర్ బ్రాండ్, కాస్టింగ్ కౌచ్, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు, చంద్రబాబు, టీడీపీ, వైఎస్ జగన్, వైసీపీ, పవన్ కళ్యాణ్, జనసేన, నాగబాబు, ఎన్నికల ఫలితాలు, సర్వే, ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్,
చేతిపై జగన్ పేరును గోరింటాకుతో వేయించుకున్న శ్రీ రెడ్డి (Images : Facebook)


గోరింటాకు బదులు జగన్ పేరును ఏ పచ్చబొట్టో వేయించుకుంటే అది శాశ్వతంగా ఉంటుంది. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు కదా... ఆ విషయాన్ని గ్రహించిన శ్రీ రెడ్డి... తాత్కాలికంగా ఓ 20 రోజులు మాత్రమే ఉండే గోరింటాకుతో జగన్ పేరును చేతిపై రాయించుకోవడం ద్వారా జస్ట్... వైసీపీలోకి ఎంట్రీపై ఓ ఫీలర్ వదిలిందంటున్నారు విశ్లేషకులు. అదే సమయంలో దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. కులంపై అభిమానం ఉండబట్టే ఆమె జగన్‌కు సపోర్ట్ చేసిందని విమర్శిస్తున్నారు కొందరు.

శ్రీరెడ్డిపై జగన్ అభిప్రాయమేంటి : ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్... వీలైనంతవరకూ మౌనంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న నేతల సంఖ్య ఎక్కువగా ఉంది. దానికి తోడు... వైసీపీ అధికారంలోకి వస్తుందనే సంకేతాలు, రకరకాల సర్వేలూ... ఆ పార్టీకి క్రేజ్ పెంచాయి. అందువల్ల అప్రమత్తం అయిన జగన్... ప్రస్తుతం ఎవరినీ తన పార్టీలోకి ఆహ్వానించకుండా... ఫలితాలు వచ్చిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. మరి శ్రీరెడ్డి కోరితే, ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తారా లేదా అన్నది ప్రస్తుతానికి తేలని అంశం. ఫాలోయర్లు ఎక్కువగా ఉన్నందువల్ల ఆమెను ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయంటున్నారు కొందరు.

మరో రోజా అవుతారా ? : ఇప్పటికే వైసీపీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్యే రోజా... ప్రత్యర్థి పార్టీలపై మాటలతోనే విరుచుకుపడుతూ... వైసీపికి మూల స్తంభాల్లో ఒకటిగా నిలిచారు. దానికి తోడు జబర్దస్త్ కామెడీ షో కూడా ఆమెను ప్రజలకు చేరువ చేసింది. ఇప్పుడు శ్రీరెడ్డి కూడా వైసీపీలో చేరితే... కచ్చితంగా ఆమె మరో ఫైర్ బ్రాండ్ అవ్వగలదనే అంచనాలున్నాయి. ఐతే ప్రత్యర్థులపై విరుచుకుపడే విషయంలో రోజా... కాస్త జాగ్రత్తగా ఆచి తూచి స్పందిస్తుంటారు. శ్రీరెడ్డి వైసీపీలో చేరితే, కచ్చితంగా ఆమె మాటలను అదుపులో పెట్టుకోక తప్పదు. సోషల్ మీడియాలో చెలరేగినట్లు రాజకీయ పార్టీల్లో ప్రవర్తిస్తే కుదరదంటుని సూచిస్తున్నారు ఎనలిస్టులు.

ఐదేళ్ల తర్వాత ఎమ్మెల్యే ? : జనసేన అధినేత పవన్ కళ్యాణ్... ఐదేళ్ల కిందట పార్టీ పెట్టినా... తొందరపడకుండా... ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే విధంగా శ్రీ రెడ్డి కూడా... ఐదేళ్ల తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటోందన్న వాదన వినిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో ఉన్న ఆమె... ఇప్పటి నుంచీ ఆ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు తెరవెనక మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది. నిజంగా వైసీపీ అధికారంలోకి వచ్చి, ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే... ఆమె ఆ పార్టీలో చేరి... మరింత ఎక్కువ మందికి చేరువై... 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటికి కాలమే సమాధానం చెప్పాలి.

 

ఇవి కూడా చదవండి :

బ్యాలెన్స్ ఫార్ములాతో లగడపాటి సర్వే... వైసీపీ షాక్ ఇస్తుందా...?

రెస్ట్ లేని జగన్... లోటస్‌పాండ్‌కి నేతల క్యూ... సీనియర్ల సలహాలు...

ఇంటర్‌ బోర్డు నుంచి గ్లోబరీనా ఔట్... కొత్త సంస్థకు సప్లిమెంటరీ ఫలితాల బాధ్యత
First published: