జనసేన ఎమ్మెల్యేపై శ్రీరెడ్డి ‘కేక’ పోస్ట్...

శ్రీరెడ్డి, రాపాక వరప్రసాద్ (File)

వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులకు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీలో మద్దతు పలికారు.

  • Share this:
    జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మీద నటి శ్రీరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన ఫేస్ బుక్ ఖాతాలో వరప్రసాద్ మీద ఓ కామెంట్ పోస్ట్ చేసింది. ‘రాపాక మీరు కేక’ అని కామెంట్స్ పోస్ట్ చేసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వికేంద్రీకరణ బిల్లుకు రాపాక వరప్రసాదరావు అసెంబ్లీలో మద్దతు పలికారు. ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను వ్యతిరేకించాలని, ఒకవేళ దానిపై ఓటింగ్ నిర్వహిస్తే అందుకు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ పవన్ కళ్యాణ్ రాపాక వరప్రసాద్‌కు బహిరంగ లేఖ రాశారు. అయితే, అధినేత లేఖను లైట్ తీసుకున్న రాపాక వరప్రసాద్ తాను మాత్రం వికేంద్రీకరణ బిల్లుకు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే శ్రీరెడ్డి రాపాక వరప్రసాద్ మీద ‘రాపాకా.. మీరు కేక’ అని కామెంట్ పోస్ట్ చేసింది.

    Published by:Shiva Kumar Addula
    First published: