నెల్లూరు తీరంలో శ్రీలంక బోటు..రాకెట్ ప్రయోగం వేళ కలకలం..

శ్రీలంక నుంచి ఉగ్రవాదులు వచ్చి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మరోవైపు బుధవారమే నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో pslv c-46 రాకెట్ ప్రయోగం జరగనుంది. దాంతో షార్ పరిసరాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.

news18-telugu
Updated: May 21, 2019, 8:34 PM IST
నెల్లూరు తీరంలో శ్రీలంక బోటు..రాకెట్ ప్రయోగం వేళ కలకలం..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 21, 2019, 8:34 PM IST
నెల్లూరు తీరంలో శ్రీలంకకు చెందిన ఓ బోటు తీవ్ర కలకలం రేపింది. విడవలూరు మండలం రామతీర్థం సముద్ర తీరంలో ఈ మోటార్ బోట్‌ని స్థానికులు, మత్స్యకారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకొని పరిశీలించారు. అది శ్రీలంక బోటుగా గుర్తించిన పోలీసులు...అది ఏపీ తీరానికి ఎలా వచ్చింది? అందులో ఎవరు వచ్చారాన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించి తనిఖీలు చేపట్టారు.

ఈస్టర్ ఉగ్రదాడి ఘటన తర్వాత శ్రీలంకలో తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు. దాంతో చాలా మంది ఉగ్రవాదులు సముద్ర మార్గంలో పారిపోయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శ్రీలంక నుంచి ఉగ్రవాదులు వచ్చి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మరోవైపు బుధవారమే నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో pslv c-46 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఉదయం 5.30గంటలకు నింగిలోకి రాకెట్‌‌ని పంపనున్నారు. ఈ క్రమంలో నెల్లూరు తీరంలో శ్రీలంక బోటు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ముందుజాగ్రత్తగా షార్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.First published: May 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...