హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Janmashtami 2022: ఏపీలో మొదలైన శ్రీకృష్ణ జన్మాష్టమి సందండి.. ఈ 5 వస్తువులు కొంటే.. మీ ఇంట డబ్బే డబ్బు

Janmashtami 2022: ఏపీలో మొదలైన శ్రీకృష్ణ జన్మాష్టమి సందండి.. ఈ 5 వస్తువులు కొంటే.. మీ ఇంట డబ్బే డబ్బు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Janmashtami 2022: హిందువులు అందరికీ ఇష్టమైన దైవం శ్రీకృష్ణుడు.. అందుకే శ్రీ కృష్ణాష్ణమిని ప్రతి ఒక్కరూ వైభవంగా జరుపుకుంటారు.. మరో నాలుగు రోజుల్లో కృష్ణాష్టమి రాబోతుంది. ఆ రోజున కొన్ని వస్తువులు కొని ఇంటికి తీసుకువస్తే.. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఇప్పటికే కృష్ణాష్ణమి సందర్భంగా.. ఏపీలో ఆయా వస్తువులు కొనేందుకు షాపుల దగ్గర రద్దీ పెరిగింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Janmashtami 2022: తెలుగు రాష్ట్రాల్లో శ్రీ కృష్ణుడి జన్మాష్టమి (Sri Krishna Janmashtami) పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగను ఈ నెల 18న జరుపుకోనున్నారు. రోహిణి నక్షత్రమందు భాద్రపద మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు శ్రీకృష్ణభగవానుడు (Lord Krishna) జన్మించారు. అందుకే ఈ రోజున కృష్ణాష్ణమి జరుపుకుంటారు. ఆగస్టు 18 వతేదీ సాయంత్రం గంటల 21 నిమిషాలకు ప్రారంభమై..ఆగస్టు 19వ తేదీ రాత్రి 10 గంటల 59 నిమిషాలకు పూర్తవుతుంది. జన్మాష్టమి రోజున దేవకి (Devaki), వసుదేవుడు (Vasudevudu) , బలరాముడు (Balaramudu) , యశోద (Yasodha), లక్ష్మీదేవి (Lakshmi Devi) పేరుతో పూజ ప్రారంభించాలి. ఆ రోజున విష్ణు పురాణం, భగవద్గీత తప్పకుండా చదవాలి. పూజ తరువాత ప్రసాదం పంచిపెట్టాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది. ఆ రోజు అందరూ ఇంటి ముందు ముగ్గులు పెట్టడం, చిన్ని పిల్లలను కృష్ణుడిలా అలకరించడం, ఉట్టి కొట్టే పోటీలు మెుదలైనవి ఉంటాయి. శ్రీకృష్ణ జన్మాష్ఠమి సమీపిస్తోంది. ఇప్పట్నించే సంబరాల ఏర్పాట్లు, పూజా కార్యక్రమాలు ప్రారంభమౌతున్నాయి.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఈ పండుగను ఘనంగా జరపుకుంటారు.. ఇంట్లో పిల్లలు ఉంటే.. అబ్బాయిలను కృష్ణుడిగా.. అమ్మాయిలను గోపికలు గా తయారు చేసి.. వారి ముచ్చట తీర్చుకుంటారు.. అలంకరణ కోసం భారీగా ఖర్చుకు సైతం వెనుకడారు. అప్పుడే ఏపీలో ఆ సందడి కనిపిస్తోంది. ఆయా షాపులన్నీ రద్దీగా మారాయి.. నెమలి పించం.. వేణువు.. నెత్తిపై కిరీటం లాంటి వస్తువులు.. చిన్న పిల్లల పంచెలు.. చిన్న పిల్ల ఆభరణాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. అయితే ఈ జన్మాష్టమి రోజున 5 వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తారు. ఆ వస్తువులేంటో తెలుసుకుందాం. 

ఈ 5 వస్తువులను కొనండి

శ్రీకృష్ణునికి ఇష్టమైనది వేణువు.. అందుకే కృష్ణ జన్మాష్టమి రోజున చెక్క లేదా వెండి వేణువు ఏదైనా కొని తీసుకురావడం మంచిది అంటున్నారు. అలా చేస్తే.. ఇంట్లోని ఇబ్బందులన్నీ తొలగిపోతాయంటున్నారు. అలా చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. అలాగే శ్రీకృష్ణుడుకి ప్రీతికరమైన వస్తువులో మరొకటి నెమలి పించం. దీనిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తే జాతకంలో దోషాలు తొలగిపోతాయి. కాలసర్ప దోషం సైతం పోతుంది అంటున్నారు.

ఇదీ చదవండి : నెల్లూరులో ఘనంగా వేంకటేశ్వర వైభవోత్సవాలు.. తిరుమల తరహాలో శ్రీవారి సేవలు

కృష్ణ జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడికి వెన్న నైవేథ్యంగా పెట్టి.. ఇంటిలో చిన్నపిల్లలు ఉంటే తినిపించండి. మీరు కోరిన కోరికలన్నీ తీరుతాయని పండితులు చెబుతున్నారు. జన్మాష్టమి రోజున వైజయంతి మాల కొని ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలిగి.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చివరిగా శ్రీకృష్ణుడికి గోవులంటే చాలా ఇష్టం. జన్మాష్టమి నాడు ఆవు, దూడల చిన్న విగ్రహాలను కొనుగోలు చేసి ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే.. శ్రీకృష్ణుడు సంతోషించి.. వరాల జల్లు కురిపిస్తాడని పండితులు చెబుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Astrology, Hindu festivals, Sri Krishna Janmashtami

ఉత్తమ కథలు