తిరుపతి, శ్రీశైలంలో దర్శనాలకు ఓకే... శ్రీకాళహస్తి ఆలయం మాత్రం మూసివేత

శ్రీకాళహస్తి

తిరుపతికి సమీపంలో శ్రీకాళహస్తి ఆలయం మాత్రం ఇప్పుడప్పుడే తెరుచుకునే అవకాశం లేదు.

  • Share this:
    కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో తిరుమల సహా రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో భక్తులను అనుమతించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే తిరుపతికి సమీపంలో శ్రీకాళహస్తి ఆలయం మాత్రం ఇప్పుడప్పుడే తెరుచుకునే అవకాశం లేదు. శ్రీకాళహస్తి ప్రాంతం కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉండటమే ఇందుకు కారణం. శ్రీకాళహస్తి వాయు లింగేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తుల అనుమతి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తదుపరి ప్రభుత్వ ఆదేశాల జారీ వరకు భక్తులు స్వామి వారి దర్శనానికి అనుమతి నిషేధిస్తున్నట్లు ఆలయ ఈఓ చంద్రశేఖర్ వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయానికి రావద్దని తెలిపారు.

    ఆలయంలోకి ఎప్పటి నుంచి భక్తులకు అనుమతి ఇస్తామన్నది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు అనుమతులు లభించిన తర్వాత గంటకు 300 మంది భక్తుల చొప్పున పరిమితంగానే ఆలయంలోకి భక్తులను అనుమతిస్తామని తెలిపారు. రాహుకేతు పూజలు సంబంధించి వన్ బైక్ థర్డ్ విధానంలో అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తదుపరి ప్రభుత్వ ఆదేశాలు అనుగుణంగా ఆలయంలోకి భక్తులను అనుమతించే నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: