హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలో ఘోర ప్రమాదం.. కారు కరెంట్ స్తంభాన్ని ఢీకొని.. ఇద్దరు సజీవ దహనం..

ఏపీలో ఘోర ప్రమాదం.. కారు కరెంట్ స్తంభాన్ని ఢీకొని.. ఇద్దరు సజీవ దహనం..

అతి వేగంతో అదుపుతప్పిన కారు మల్లిసాల వద్ద ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. వారు తేరుకునే లోపే మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో కారు మొత్తం వ్యాపించాయి.

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో అతి వేగంతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం క్షణాల్లోనే మంటలంటుకొని కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. ఐదుగురు వ్యక్తులు మారుతి 800 కారులో గోకవరం నుంచి వైజాగ్‌కు బయలుదేరారు. ఐతే అతి వేగంతో అదుపుతప్పిన కారు మల్లిసాల వద్ద ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. వారు తేరుకునే లోపే మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో కారు మొత్తం వ్యాపించాయి. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఘోరం జరిగింది.

ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

First published:

Tags: Andhra Pradesh, AP News

ఉత్తమ కథలు