Home /News /andhra-pradesh /

SPECULATIONS OVER PRASHANT KISHORE WARNS YS JAGAN OVER THESE THREE IMPORTANT ISSUES FULL DETAILS HERE PRN GNT

YS Jagan: సీఎం జగన్ చేతికి పీకే రిపోర్ట్..? ఆ అంశాలపై హెచ్చరించారా..? అసలు నిజం ఇదేనా..?

వైఎస్ జగన్ తో ప్రశాంత్ కిశోర్ (ఫైల్)

వైఎస్ జగన్ తో ప్రశాంత్ కిశోర్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YSRCP) అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ (YS Jagan Mohan Reddy) ముఖ్యమంత్రి కావడంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

  Anna Raghu, Guntur, News18

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YSRCP) అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ (YS Jagan Mohan Reddy) ముఖ్యమంత్రి కావడంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ప్రచారంతో పాటు మేనిఫెస్టో, ప్రచారం, పాదయాత్ర ఇలా ప్రతి అంశంలోను పీకే టీమ్ సీఎం జగన్ వెంట నడిచింది. దీంతో ఏపీ చరిత్రలోనే వైసీపీ రికార్డుస్థాయి మెజారిటీతో విజయం సాధించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ కు పీకే టీమ్ కు మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ పీకే టీమ్ రిపోర్ట్స్ పైనే సీఎం ఆధారాపడుతున్నారు. సొంత పార్టీ నేతలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులతో పాటు పీకే నివేదికల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ఇటీవల సీఎంకు పీకే రిపోర్ట్స్ ఇచ్చారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆ రిపోర్టుల్లో ముఖ్యంగా మూడు అంశాలపై జగన్ హెచ్చరించారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వివిధ పథకాల పేరిట ప్రజల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తోంది. ఆదాయం అంతగా లేకపోయినా, కరోనా వల్ల నష్టపోయినా అప్పులు చేసి మరీ పథకాలకు కేటాయిస్తోంది. ఆ పథకాలే వచ్చే ఎన్నికల్లో తమను గెలిపిస్తాయని వైసీపీ భావిస్తోంది. కానీ పీకే రిపోర్ట్ మాత్రం దానికి విరుద్ధంగా ఉందట. అప్పులను కూడా ప్రజలను పట్టించుకుంటున్నారని.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిలో తేడా వస్తే పుట్టిమునగడం ఖాయమని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఐతే అఫ్పులు చేయడం ఆపేస్తే పథకాలు నిలిపేయాల్సి వస్తుంది.. అలా అయితే ప్రజలు తిరగబడతారని ప్రభుత్వం అన్నట్లు సమాచారం.

  ఇది చదవండి: ఎన్టీఆర్ జిల్లాపై ఆసక్తికర చర్చ.. తెరపైకి వంగవీటి రంగా పేరు..


  గత రెండేళ్లుగా రాష్ట్రంలో తీవ్ర దుమారానికి కారణమైన మూడు రాజధానుల వ్యవహారంపైనా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు పీకే రిపోర్టులో పేర్కొన్నారట. మూడు రాజధానులపై మైలేజ్ రాకపోగా డ్యామేజే ఎక్కువ జరిగిందట. విశాఖలో పాజిటివ్ రిపోర్ట్ రాకపోగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారంటూ నెగెటివ్ రెస్పాన్సే వచ్చిందని చెప్పినట్లు తెలిస్తోంది. అంతేకాదు మూడు రాజధానుల అంశం వైజాగ్ తో పాటు కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం జిల్లా, గోదావరి జిల్లాల్లోనూ ప్రతికూలతే వచ్చిందట.

  ఇది చదవండి: నాలుగు జిల్లాలు.. ఎనిమిది మంది ఎంపీలు.. కానీ ఇద్దరే యాక్టివ్.. మిగతా ఎంపీలెక్కడ..!


  ఇక మూడో అంశానికి వస్తే గత ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించినా.. పార్టీలో కుమ్ములాటలు మాత్రం అంతేస్థాయిలో ఉన్నట్లు పీకే పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా చోట్ల గ్రూపు రాజకీయాలు పార్టీకి ఇబ్బందిగా మారాయని.. దాదాపు 50కి పైగా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది.. రానున్న రోజుల్లో ఈ సంఖ్య 80దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీలో మొదట్నుంచి ఉన్న నేతలు, మధ్యలో వచ్చినవాళ్లు, గెలిచిన తర్వాత చేరిన వాళ్లు ఇలా నియోజకవర్గానికి మూడు తగ్గకుండా గ్రూపులున్నాయని.. ముందు వాటిపై దృష్టిపెట్టాలని సూచించినట్లు టాక్. వీటికి అదనంగా అవినీతి ఆరోపణలు కూడా మైనస్ గా మారాయని.. వెంటనే వీటిని సరిచేసుకోకుంటే ఇబ్బందులు తప్పవని పీకే హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Prashant kishor, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు