హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా..? అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారా..?

YS Jagan: జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా..? అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారా..?


ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా ఐటీఐ విద్యార్ధులకు  10 వేలు ప్రతి ఏటా రెండు వాయిదాల్లో.. పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు 15 వేల రూపాయలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు నేర్చుకునే వారికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం.

ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా ఐటీఐ విద్యార్ధులకు 10 వేలు ప్రతి ఏటా రెండు వాయిదాల్లో.. పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు 15 వేల రూపాయలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు నేర్చుకునే వారికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన దాదాపు మూడేళ్లయింది. అప్పటి నుంచి సీఎం జగన్ (CM YS Jagan) పాలనపై తప్ప పార్టీపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఐతే సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ఇచ్చిన ఆదేశాలు, ఇటీవల పార్టీ పరంగా చేపట్టిన చర్యలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి.

ఇంకా చదవండి ...

  Anna Raghu, Guntur, News18­

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన దాదాపు మూడేళ్లయింది. అప్పటి నుంచి సీఎం జగన్ (CM YS Jagan) పాలనపై తప్ప పార్టీపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఐతే సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ఇచ్చిన ఆదేశాలు, ఇటీవల పార్టీ పరంగా చేపట్టిన చర్యలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. సీఎం జగన్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చుననేఊహాగానాలు రాష్ట్రంలో జోరందుకున్నాయి. ఇటీవలి కాలంలో పార్టీ చేపట్టిన కీలక నియామకాలు దీనికి ఊతం ఇస్తున్నాయి. ఉత్తరాంధ్ర బాధ్యుడిగా ఉన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) ని ఇప్పుడు పార్టీ అన్ని అనుభంధ విభాగాల ఇన్ఛార్జ్ గా నియమించడంతో జగన్ పార్టీ పై ధృష్టి పెట్టినట్లు స్పష్టం అవుతుంది.

  2019 ఎన్నికల ముందు వరకు ఎంతో యాక్టీవ్ గా ఉన్న వైసీపీ అనుబంధ సంఘాలు ఆ తరువాతి కాలంలో పూర్తిగా స్తబ్దుగా మారిపోయాయి. దీనంతటికీ కారణం పార్టీ అనుబంధ సంఘాల సభ్యులను ఆయా ప్రాంతాలలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలూ ఉన్నాయి. నాయకులు తమ అనుచరులకు బంధువులకు ఇస్తున్న ప్రాధాన్యతలో కనీసస్థాయిలోనైనా తమను పట్టించుకోవడంలేదనేది వారి భావన. దీంతో వైసీపీ అనుబంధ సంఘాలు పూర్తిగా కాడివదిలేశాయనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంలో అనుబంధసంఘాలు కీలక పాత్ర పోషించాయి. పార్టీలో సమర్ధవంతమైన నాయకుడు క్యాడర్ లో మనోస్థైర్యం నింపగలిగిన విజయసాయిరెడ్డి ఐతేనే అనుబంధసంఘాలకు జవజీవాలు అందించగలుగుతాడని జగన్ నమ్మకం కావచ్చు.

  ఇది చదవండి: మేకపాటి గౌతమ్ రెడ్డికి అసెంబ్లీ నివాళి.. సీఎం జగన్ కీలక ప్రకటన..


  దీనికితోడు త్వరలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రజలలో ఉంటూ పార్టీ బలోపేతానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పైగా పీఆర్సీ అంశంలో ఉద్యోగులు, డి.టి.సి.పీ అప్రూవల్ అంటూ ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఇబ్బందులకు గురిచేయటంతో ఆయావర్గాలు పార్టీ పై గుర్రగా ఉన్నాయనే చెప్పాలి. దీనికి తోడు ఇటీవలి కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతున్న కోర్టు తీర్పులు, రాజధాని అమరావతి విషయంలో ఎదురవుతున్న అడ్డంకులు, మూడేళ్ళు గడుస్తున్నా మూడు రాజధానులుపై ఒక్కఅడుగూ ముందుకు పడకపోవడం, ఆర్ధిక ఇబ్బందులు, ఇవన్నీ కలసి రానున్న రోజులలో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయో అవకాశం ఉందని, టీడీపీ జవసత్వాలు కూడదీసుకునేలోపు ముందస్తు ఎన్నికలకు వెళితే విజయం సాధించవచ్చుననే పార్టీ ప్రముఖుల భావనగా ఉందంటున్నారు.

  ఇది చదవండి: పవన్ కళ్యాణ్ అభిమానులపై కేసు నమోదు.. కారణం ఇదే..!


  కేబినెట్ సమావేశం సందర్భంగా మే నెల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలని.. ముఖ్యంగా మంత్రుల్లో వారానికి మూడు రోజులు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించే పనిలోనే ఉండాలని ఆదేశించారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వం ఏం చేస్తోందనే అంశాలను కూడా వివరించాలని జగన్ ఆదేశించారు.

  ఇది చదవండి: గుడివాడలో వంగవీటి రాజకీయం..? ఆ భేటీ వెనుక కారణం ఇదేనా..?


  సీఎం జగన్ ఇంత సడన్ గా పార్టీపై దృష్టిపెట్టడంతో ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారా..? అనే ఊహాగానాలకు ఊతమిస్తోంది. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇదే ఫార్ములా అమలు చేసి సక్సెస్ అయ్యారు. ఐతే ఈ విషయంపై పూర్తి స్పష్టత రావాలంటే కొన్నాళ్లు ఓపిక పట్టాల్సిందే.!

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ysrcp

  ఉత్తమ కథలు