Home /News /andhra-pradesh /

SPECULATIONS OVER AP GOVERNMENT TO FORM REGIONAL DEVELOPMENT ZONES INSTEAD OF 3 CAPITALS FULL DETAILS HERE PRN

AP Development Zones: నాలుగు జోన్లుగా ఆంధ్రప్రదేశ్..? సీఎం జగన్ మాటల్లో అర్ధం ఇదేనా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఇటీవల మూడు రాజధానుల బిల్లు (3 Capitals Bill), సీఆర్డీఏ రద్దు బిల్లును వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే బిల్లులో మార్పులు చేసి ఎవరికీ నష్టం రాకుండా ఒక సమగ్రమైన బిల్లుతో మళ్లీ అసెంబ్లీ ముందుకు వస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయం నేపధ్యంలో ప్రాంతీ అభివృద్ధి మండళ్ల ఏర్పాటు అంశం తెరపైకి వస్తోంది.

ఇంకా చదవండి ...
  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఇటీవల మూడు రాజధానుల బిల్లు (3 Capitals Bill), సీఆర్డీఏ రద్దు బిల్లును వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే బిల్లులో మార్పులు చేసి ఎవరికీ నష్టం రాకుండా ఒక సమగ్రమైన బిల్లుతో మళ్లీ అసెంబ్లీ ముందుకు వస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయం నేపధ్యంలో ప్రాంతీ అభివృద్ధి మండళ్ల ఏర్పాటు అంశం తెరపైకి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్లూ సంక్షేమ పథకాల అమలుపైనే దృష్టి సారించింది. ఒక విధంగా అభివృద్ధిపై పెద్దగా దృష్టిపెట్టలేదనే చెప్పాలి. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఆ బిల్లు వెనక్కి తీసుకున్నందున ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  దీని ద్వారా అభివృద్ధి విషయంలో ప్రాంతాల మధ్య అసమానతలు తగ్గించవచ్చనేది ప్రభుత్వ వ్యూహంగా తెలుస్తోంది. మూడు రాజధానుల బిల్లులు రిపీల్ సందర్భంగా సీఎం జగన్ అమరావతిని ఉద్దేశించి ఈ ప్రాంతమంటే తనకు ప్రేమ అని చెప్పడం వెనుక ఇదే వ్యూహం ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం. రాష్ట్ర విభజన, రాజధాని ఏర్పాటు సమయంలో అభివృద్ధి మండళ్ల అంశం తెలపైకి వచ్చినా కార్యరూపం దాల్చలేదు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆ దిశగా దృష్టి సారించలేదు.

  ఇది చదవండి: సినిమా టికెట్లపై పునారాలోచించండి.. సీఎం జగన్ కు మెగాస్టార్ ట్వీట్..


  ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇదే విధానాన్ని అమలు చేయాలని చూస్తోందన్న చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, దక్షిణకోస్తా, రాయలసీమలను నాలుగు ప్రాంతీయ మండళ్లుగా నియమించి అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తే బాగుంటుందనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

  ఇది చదవండి: జూ.ఎన్టీఆర్ తో స్నేహంపై కుండబద్దలు కొట్టిన కొడాలి నాని.. నందమూరి కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు..


  విశాఖపట్నం కేంద్రంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను కలిపి ఒక ప్రాంతీయ మండలి, రాజమండ్రి కేంద్రంగా ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణాజిల్లాను కలిపి ఒక ప్రాంతీయ మండలి, ఒంగోలు కేంద్రందా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో ఒక ప్రాంతీయ అభివృద్ధి మండలి, చిత్తూరు,కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు కర్నూలు కేంద్రంగా మరో ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేసేందుకు అవకాశాలున్నాయి.

  ఇది చదవండి: పెన్సిల్ పోయిందంటూ పోలీస్ కంప్లైంట్... తగ్గేదేలే.. అంటున్న బుడ్డోడు..!


  ఈ ప్రాంతీయ అభివృద్ధి మండళ్లకు ఆయా ప్రాంతాలకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, ఇతర నిపుణులను ఛైర్మన్లు, సభ్యులుగా నియమించనున్నట్లు సమాచరాం. ఆ మండళ్లకు కలెక్టర్ హోదా కలిగిన ఐఏఎస్ అదికారులను సభ్య కార్యదర్శులుగా నియమించి అక్కడి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిథులను సభ్యులుగా నియమించడం ద్వారా రాజకీయంగానూ పదవలు కల్పించే అవకాశముంది. ఈ అభివృద్ధి మండళ్ల సభ్యులు తమ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వనరులు, భౌగోళిక స్వరూపం, రవాణా, ఇతర మౌలిక సదుపాయాలను పరిగణలోకి తీసుకొని అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తారు. ఇందుకోసం వీరంతా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో పర్యటించి అధ్యయనం చేస్తారు.

  ఇది చదవండి: గ్రామ సచివాలయ ఉద్యోగుల వింత పరిస్థితి.. పెళ్లికి ప్రొబేషన్ కు లింక్..! అదెలాగంటే..!


  అమరావతి పరిస్థితేంటి..
  ఇక ప్రస్తుతానికి రాజధానిగా అమల్లో ఉన్న అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తి చేసి విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడికి తరలించే అవకాశాలున్నాయి. తద్వారా ప్రభుత్వం అద్దె రూపంలో భరిస్తున్న ఖర్చును తగ్గించుకునే అవకాశాలున్నాయి. ఇందుకోసం రూ.3వేల కోట్ల నిధులతో ప్రణాళికలు రూపొందిస్తునట్లు తెలుస్తోంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap capital

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు