Home /News /andhra-pradesh /

SPECULATIONS ON MLA ROJA THA SHE HAS POLITICAL REASONS FOR DEMANDING NAGARI SHOULD BE IN SRI BALAJI DISTRICT FULL DETAILS HERE PRN TPT

MLA Roja: రోజా ఆ డిమాండ్ చేయడానికి కారణం ఇదేనా..? అలా అయితేనే అదృష్టం వరిస్తుందా..?

ఎమ్మెల్యే రోజా, సీఎం జగన్ (ఫైల్)

ఎమ్మెల్యే రోజా, సీఎం జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త జిల్లాల (AP New Districts)పై అభ్యంతరాలు, సూచనలు, సలాహాలు, కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే.

    GT Hemanth Kumar, Tirupathi, News18

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త జిల్లాల (AP New Districts)పై అభ్యంతరాలు, సూచనలు, సలాహాలు, కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలతో పాటు అధికార వైసీపీ (YSRCP) నుంచి తా కొత్త జిల్లాల హద్దులు, ఇతర కీలక అంశాలపై అభ్యంతరాలు వస్తున్నాయి. ప్రజలకు అభీష్టం మేరకు తలగొగ్గుతున్న కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలూ జిల్లా కేంద్రాలు, తమను వేరొక జిల్లాలోకి మార్చాలని సీఎం జగన్ (AP CM YS Jagan), విభజన కమిటీకి విన్నతులు ఇస్తున్నారు. కొన్నిచోట్ల కొత్త జిల్లాల డిమాండ్లలో రాజకీయ కోణాలు కూడా బయటపడుతున్నాయి.తమపై పెత్తనం చెలాయిస్తున్న బడా నేతల నుంచి తప్పించుకోవాలనుంటే వేరే జిల్లాలోకి వెళ్లాలని నిశ్చయించుకుంటున్నారు. ఇలా అయినా ఇంటిపోరు తగ్గించుకోవాలన్నది సదరు నేతల భావనగా ఉంది.

    తనకు తన నియోజకవర్గానికి ఏదైనా కావాలి అంటే... కచ్చితంగా ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పేస్తారు నగరి ఎమ్మెల్యే రోజా (MLA Roja). ప్రస్తుతం ఆమె కొత్త జిల్లాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా చిత్తూరు జిల్లాలోకి వెళ్తున్నా నగరి నియోజకవర్గాన్ని శ్రీబాలాజీ జిల్లాలో కలపాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ను కలిసి విజ్ఞప్తి చేసేందుకు కూడా ఆమె రెడీ అయ్యారు. అంతేకాదు శ్రీ బాలాజీ జిల్లా పేరుపైనా రోజా చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రస్తుతం విభజించిన చిత్తూరు జిల్లాను కాదని నూతనంగా ఏర్పడిన శ్రీ బాలాజీ జిల్లాలో పూర్తిగా చేర్చాలను ఆమె బలంగా కోరుతున్నారు.

    ఇది చదవండి: జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఈ లిస్టులో ఉన్నది వీళ్లే..!


    ఎమ్మెల్యే రోజా ఈ డిమాండ్ చేయడానికి ముఖ్యకారణం ఏంటంటే.. నగరి నియోజకవర్గంలో కొంత బాలాజీ జిల్లాలో, కొంత చిత్తూరు జిల్లాలో ఉండటం వల్ల నగరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారని ఆమె అభిప్రాయం. ప్రజల కోరిక మేరకు జగన్ ను కలిసి సమస్యను వివరిస్తానంటున్నారు. ఐతే రోజా అభిప్రాయంలో రాజకీయ కోణం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

    ఇది చదవండి: విజయసాయి రెడ్డిపై ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్.. అంతమాట అనడానికి కారణం ఇదేనా..?


    నగరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో కొనసాగితే రాజకీయంగా ఇబ్బందులకు గురైయ్యే అవకాశాలెక్కువగా ఉన్నాయని ఆమె భావిస్తున్నారట. ఇందుకు కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.., రోజా మధ్య ఉన్న వైరమే. బయటకు అందరూ బాగున్నట్లే ఉన్నా.., లోపల పొసకడం లేదని టాక్. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడైన చక్రపాణి రెడ్డి రోజాపై పైచేయి సాధించాలని ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు. పెద్దిరెడ్డి నియోజకవర్గం ఉన్న జిల్లా అంటే రోజాకు మంత్రి పదవి కష్టమే.

    ఇది చదవండి: సీఎం జగన్ చేతికి పీకే రిపోర్ట్..? ఆ అంశాలపై హెచ్చరించారా..? అసలు నిజం ఇదేనా..?


    ఇక అదే జిల్లాలో మరో ప్రత్యర్థి నారాయణ స్వామి నియోజకవర్గం కూడా ఉంది. నారాయణ స్వామి సైతం పెద్దిరెడ్డి ఏం చెబితే అదే చేస్తుంటారనే ప్రచారం జోరుగా ఉంది. రోజా నా రూటే సపరేటు అంటూ తనదైన శైలిలో రాజకీయం ముందుకు వెళ్తారు కాబట్టే.. ఇప్పటివరకు మంత్రి పదవి వరించలేదు. అందుకే జిల్లా మారితే అయినా ఫేట్ మారి మంత్రి పదవి దక్కుతుందని రోజా ఆలోచనగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP new districts, MLA Roja

    తదుపరి వార్తలు