హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలో మెడిసన్ విద్యార్థులకు అలర్ట్.. ఇకపై ఈ బాండ్ పై సైన్ చేయాల్సిందే..! కారణం ఇదే..!

ఏపీలో మెడిసన్ విద్యార్థులకు అలర్ట్.. ఇకపై ఈ బాండ్ పై సైన్ చేయాల్సిందే..! కారణం ఇదే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇకపై మంచి వైద్యసేవలు అందనున్నాయి. స్పెషలిస్ట్‌ వైద్యుల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

    ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇకపై మంచి వైద్యసేవలు అందనున్నాయి. స్పెషలిస్ట్‌ వైద్యుల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లు (CHC), ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన వైద్యులు అందుబాటులో ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా మెడికల్‌ పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు రూరల్‌ సేవలను తప్పనిసరి చేసింది. గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీల్లో రాష్ట్ర కోటా, ప్రైవేట్‌ కాలేజీల్లో ఏ–కేటగిరీ సీట్లలో అడ్మిషన్‌లు పొంది కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఒక ఏడాది పాటు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రభుత్వం వాళ్లకు గౌరవ వేతనం కూడా ఇవ్వనుంది. ఈ మేరకు వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

    అయితే ఈ నిబంధన 2022–23వ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్‌లు పొందే విద్యార్థుల నుంచే వర్తిస్తుంది. కోర్సులు పూర్తి చేసుకున్న స్పెషలిస్ట్‌ వైద్యులను తొలి ప్రాధాన్యత కింద ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో నియమించనున్నారు. ఆ తర్వాత మిగిలిన వారి సేవలను డీఎంఈ పరిధిలో వినియోగించుకోనున్నారు. నాన్‌ సర్వీస్‌ అభ్యర్థులు కోర్సు పూర్తయిన తర్వాత ఏడాది పాటు రూరల్‌ ప్రాంతాల్లో కచ్చితంగా ప్రభుత్వ సేవలు అందించేలా ముందుగానే ఒప్పంద పత్రం తీసుకుంటారు. ఒకవేళ ఎవ్వరైనా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి కోర్సు పూర్తయిన 18నెలల వ్యవధిలో ప్రభుత్వ సేవల్లో చేరకపోతే…. పీజీ చేసిన వారికి రూ.40 లక్షలు, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు చేసిన వారికి రూ.50లక్షల జరిమానా విధించనున్నారు.

    ఇది చదవండి: ఏపీ ప్రభుత్వ టీచర్లకు టెన్షన్‌..! ప్రమోషన్‌ల లిస్ట్‌ రెడీ.. వివరాలివే..!

    మరో మూడేళ్లలో స్పెషలిస్టు సేవలు..!

    ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రాష్ట్ర కోటా సీట్లలో 707 మంది, ప్రైవేట్‌ కాలేజీల్లో ఏ–కేటగిరీ సీట్లలో 1,142 మంది విద్యార్థులు అడ్మిషన్‌లు పొందుతారు. వీరందరూ ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా సేవలు అందించాల్సి ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అడ్మిషన్‌లు పొందనున్న వీరందరూ 2025–26 నాటికి తమ కోర్సులు పూర్తి చేసుకుంటారు.

    ఇది చదవండి: రైతులకు అలర్ట్‌..! త్వరగా ఈ-కేవైసీ చేయించుకోండి..! లేకపోతే ఈ పథకాలు రానట్లే..!

    అనంతరం కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవల్లో చేరాల్సి ఉంటుంది. మెడికల్‌ పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేలా ముందుగానే వాళ్ల నుంచి బాండ్‌ పేపర్స్‌ మీద సంతకాలు తీసుకోవాలని అన్ని కాలేజీలకు డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో మరో మూడేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత తీరనుంది. దీనివల్ల ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.

    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Local News

    ఉత్తమ కథలు