హైదరాబాద్- శ్రీకాకుళం మధ్య స్పెషల్ ట్రైన్

హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:53 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 1:10 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: August 16, 2019, 9:09 AM IST
హైదరాబాద్- శ్రీకాకుళం మధ్య స్పెషల్ ట్రైన్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి నిత్యం వివిధ ప్రాంతాలకు జనం ప్రయాణాలు చేస్తుంటారు. చాలామంది రైళ్లలో ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. అందుకే రైల్వే శాఖ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నెల 17, 19 తేదీల్లో హైదరాబాద్-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైలు (07026) ను నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. రైలు నడవనున్న ఈ రెండు రోజుల్లోనూ సాయంత్రం ఏడున్నర గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:53 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 1:10 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

తిరుగు ప్రయాణంలో 18, 20 తేదీల్లో రైలు (07025) శ్రీకాకుళం రోడ్ నుంచి మధ్యాహ్నం 1:15 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8:20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకే ఈ రైలును నడుపుతున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...