విశాఖలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఆత్మహత్య

కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకొని ఉంటారని భావిస్తున్నారు.

news18-telugu
Updated: May 15, 2020, 5:30 PM IST
విశాఖలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఆత్మహత్య
డీఎస్పీ కృష్ణ వర్మ (ఫైల్ ఫొటో)
  • Share this:
విశాఖలో డీఎస్పీ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణవర్మ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖపట్టణం బీచ్‌ రోడ్డులోని తమ నివాసంలో ఉరివేసుకొని చనిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు డీఎస్పీ నివాసానికి వెళ్లి పరీశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కృష్ణవర్మకు భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు బీటెక్ చదువుతుండగా.. చిన్న కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. కృష్ణ వర్మ శ్రీకాకుళం జిల్లాలో పదేళ్ల పాటు ఎస్‌ఐగా పనిచేశారు. అనంతరం డీఎస్పీగా పదోన్నతి లభించింది. ఐతే కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం సెలవుల్లో ఉన్నారు. అనారోగ్య కారణాలతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First published: May 15, 2020, 5:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading