వేములవాడకు హెలికాప్టర్ సేవలు... ప్రముఖ శివాలయాలకు ప్రత్యేక బస్సులు

Vemulawada : ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే పర్యాటక శాఖ బలంగా ఉండాలని భావించిన కేసీఆర్ సర్కార్... ఆ దిశగా వేగవంతమైన చర్యలు చేపడుతోంది.

news18-telugu
Updated: February 17, 2020, 8:52 AM IST
వేములవాడకు హెలికాప్టర్ సేవలు... ప్రముఖ శివాలయాలకు ప్రత్యేక బస్సులు
వేములవాడకు హెలికాప్టర్ సేవలు... ప్రముఖ శివాలయాలకు ప్రత్యేక బస్సులు
  • Share this:
ఈమధ్య మేడారం జాతరకు హెలికాప్టర్ల టూరిజంను అభివృద్ధి చేసిన తెలంగాణ ప్రభుత్వం... అది బాగా సక్సెస్ అవ్వడంతో... ఇప్పుడు తెలంగాణ... రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వరి స్వామి వారి ఆలయానికి కూడా హెలికాప్టర్ సేవల్ని ప్రారంభిస్తోంది. మహా శివరాత్రి వస్తోంది కాబట్టి... భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్లే అవకాశం ఉండటంతో... వారి సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. వేములవాడలో శివరాత్రి జాతరకు కోటి రూపాయలు ఇస్తున్నామన్న పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్... వేడుకల్ని వైభవంగా నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ నుంచీ వేములవాడకు ప్రత్యేక ప్యాకేజీల్లో హెలికాప్టర్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

అలాగే తెలంగాణ పర్యాటక శాఖ కూడా వేములవాడకు ప్రత్యేక బస్సుల్ని నడపబోతోంది. ఈ బస్సులు కూడా హైదరాబాద్ నుంచీ వేములవాడకు వెళ్తాయి. ప్రస్తుతం ఆలయం సరికొత్తగా రూపు దిద్దుకుంటోంది. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. తాగునీరు, పారిశుధ్యం పనులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. శివరాత్రి రోజు గుడి చెరువు మైదానంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు తెలంగాణలో ఫేమస్ అయిన కళాకారుల్ని తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఇలా వేములవాడలో జరిగే మహా శివరాత్రి కార్యక్రమాల్ని దిగ్విజయం చెయ్యాలని మంత్రి కోరుతున్నారు.

మరోవైపు మహాశివరాత్రి సందర్భంగా... హైదరాబాద్ నలుమూలల నుంచీ ఏపీలోని శ్రీశైల పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఈ నెల 18 నుంచీ 23 వరకు ఈ ప్రత్యేక బస్సుల్ని నడుపుతున్నారు. ఫిబ్రవరి 21న శుక్రవారం మహాశివరాత్రి పండుగ రాబోతోంది. అందువల్ల ఈ నెల 21 నుంచీ 23 వరకు శ్రీశైలం నుంచీ హైదరాబాద్‌కి ప్రత్యేక బస్సులు ఉంటాయి. ప్రతీ 20 నిమిషాలకు ఓ బస్సును నడపనున్నారు. తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మహాశివరాత్రి వేడుకను ఘనంగా జరపనున్నారు.

First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు