హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

SP Balu: ఎస్పీ బాలసుబ్రమణ్యం కోసం వైసీపీ ఎమ్మెల్యే పూజలు

SP Balu: ఎస్పీ బాలసుబ్రమణ్యం కోసం వైసీపీ ఎమ్మెల్యే పూజలు

ఒంట్లో ఇతర వ్యాధులు ఉండి.. ఇమ్యూనిటి పవర్ తక్కువగా ఉన్న వాళ్లను మాత్రమే కరోనా అటాక్ చేస్తుంది. అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎప్పుడూ హాస్పిటల్ మెట్లు ఎక్కినట్లు కానీ.. ఆయన ఆరోగ్యం దెబ్బ తిన్నట్లు కానీ ఎక్కడా చదవలేదు.. రాలేదు కూడా. అయినా కూడా ఇప్పుడు కరోనా కారణంగా ప్రాణాలతో పోరాడుతున్నాడు.

ప్రస్తుతం ఎస్పీ బాలు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని, కాలేయం మినహా అన్ని అవయవాలు పనిచేస్తున్నాయని డాక్టర్లు వెల్లడించారు.

  గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. 15 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా అందరూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. మరికొందరు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే భూమనకరుణాకర్ రెడ్డి కూడా తిరుపతలో ప్రత్యేక పూజలు చేశారు. బాల సుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని తిరుమల వెంకన్నను మొక్కుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భూమన.. బాలసుబ్రమణ్యం త్వరగా కొలుకోవాలని వెంకటేశ్వరుడ్ని వేడుకున్నానని.. ఆయన మళ్లీ పాటలు పాడాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఎస్పీ బాల సుబ్రమణ్యానికి టీటీడీతో మంచి అనుబంధం ఉందన్నాని చెప్పారు భూమన.

  ప్రస్తుతం ఎస్పీ బాలు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని, కాలేయం మినహా అన్ని అవయవాలు పనిచేస్తున్నాయని డాక్టర్లు వెల్లడించారు. విదేశీ వైద్యుల సూచనలతో ఎక్మో పరికరంతో వైద్యం చేస్తున్నామన్నాని చెప్పారు. తన తండ్రి పరిస్థితి ఇంకా విషమంగా ఉందని ఎస్పీ చరణ్ కంటతడి పెట్టారు. ఈ నేపథ్యంలో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రాణాలతో బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. కాగా, కరోనా బారిన పడిన బాలసుబ్రమణ్యం ఆగస్టు 5న నుంచి చెన్నైలోని ఎంజీఎం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: SP Balasubrahmanyam, Tirupati, Ysrcp

  ఉత్తమ కథలు