అండమాన్‌కి వస్తున్న నైరుతీ రుతుపవనాలు... తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఆలస్యమే...

Weather News : ఉక్కపోత, వేడితో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ మంచి వార్త చెప్పింది. రెండు రోజులు ముందుగానే అండమాన్‌ని నైరుతీ రుతుపవనాలు పలకరించబోతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 16, 2019, 6:14 AM IST
అండమాన్‌కి వస్తున్న నైరుతీ రుతుపవనాలు... తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఆలస్యమే...
వర్షం పడితే ఎంతో హాయి (File Image)
Krishna Kumar N | news18-telugu
Updated: May 16, 2019, 6:14 AM IST
కొన్ని కొన్ని వార్తలు తెలుసుకున్నప్పుడు మనకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఇది అలాంటిదే. ప్రతీ సంవత్సరం కంటే ఈసారి రెండు రోజులు ముందుగానే నైరుతీ రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకబోతున్నాయి. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. అందువల్ల రుతుపవనాలు వచ్చేందుకు అవకాశాలు మెరుగయ్యాయి. ఐతే, మనకు కూడా త్వరలోనే వానలు కురుస్తాయని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈసారి నైరుతీ రుతుపవనాలు 6 రోజులు ఆలస్యంగా తెలుగు రాష్ట్రాల్ని పలకరిస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఏటా రుతుపవనాలు జూన్ 1న కేరళలోకి వస్తాయి. తర్వాత ఉత్తర దిశగా వెళ్తూ జులై 15 కల్లా దేశమంతా చేరతాయి. ఈసారి అది ఆలస్యం కాబోతోంది.

మరో రెండు రోజుల్లో దక్షిణ అండమాన్, నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి నైరుతీ రుతుపవనాలు రాబోతున్నాయి. సాధారణంగా మే 20న అండమాన్‌కి వచ్చే రుతుపవనాలు... ఈసారి రెండు రోజులు ముందుగానే అండమాన్‌కి రాబోతున్నాయి. ఆ తర్వాత పది రోజులకు కేరళకు రావాలి. ఐతే, అలా ఈసారి జరగదంటున్నారు వాతావరణ అధికారులు. అండమాన్‌కి ముందే వచ్చినా, ఉత్తరాది నుంచీ వచ్చే వేడి గాలుల వల్ల కేరళకు జూన్ 6న వస్తాయంటున్నారు. అంటే మన తెలుగు రాష్ట్రాలను తాకేసరికి జూన్ 8 అవొచ్చు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతూనే ఉన్నాయి. తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్‌లో 44.4 డిగ్రీల వేడి నమోదైంది. ఆదిలాబాద్, రామగుండంలో కూడా వేడి మామూలుగా లేదు. హైదరాబాద్‌లో 43.2 డిగ్రీలు నమోదైంది. ఏపీలో కూడా ఎండలు భగ్గుమంటున్నాయి. ఐతే... ఈ నెల 19 నుంచీ 23 వరకూ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని RTGS తెలిపింది. కృష్ణా, గుంటూరు, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వేడి పెరిగే అవకాశం ఉందనీ, 44 నుంచీ 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని RTGS వివరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలనీ, ఎండ దెబ్బ తగలకుండా చూసుకోవాలని సూచించింది.

First published: May 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...