Home /News /andhra-pradesh /

SOUTH WEST MONSOON READY TO WITHDRAW HEAVY RAIN ALERT TO CHITTOOR DISTRICT FOR NEXT THREE DAYS BA

AP Rains Alert: నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు సిద్ధం, ఈ ఒక్క జిల్లాకు భారీ వర్షాల హెచ్చరిక

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాగల 2 రోజులలో జార్ఖండ్, ఛత్తీస్‌ గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర & మధ్య అరేబియా సముద్రం యొక్క మిగిలిన ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

    రాగల 2 రోజులలో జార్ఖండ్, ఛత్తీస్‌ గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర & మధ్య అరేబియా సముద్రం యొక్క మిగిలిన ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. తదుపరి 2 రోజులలో ఒడిశా, ఉత్తర మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఒరిశా తీరానికి దగ్గరలో వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం గడిచిన 6 గంటలలో 24 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి ఈరోజు(23.10.2020) ఉదయం 08:30 గంటలకు పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ తీరాలకు దగ్గరలో ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో సాగర్ దీవులు (పశ్చిమ బెంగాల్ )కు ఆగ్నేయ దిశలో 50 కి.మీ, ఖెపుపారా (బంగ్లాదేశ్)కు పశ్చిమ నైరుతి దిశలో 200 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి ఈరోజు(23.10.2020) సుమారుగా మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్, దాని పరిసర ప్రాంతాలలోని బంగ్లాదేశ్ తీరాలలో సాగర్ దీవులు, ఖెపుపారాల మధ్య సుందర్బన్స్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. ఇక తూర్పు-పశ్చిమ ద్రోణి ప్రస్తుతము 13°N Latitude వెంబడి పెనిన్సులర్ భారతదేశం మీదుగా 1.5 కి.మీ నుంచి 3.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతోంది.

    ఉత్తర కోస్తాంధ్ర, యానాం
    ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.

    దక్షిణ కోస్తా ఆంధ్ర
    ఈ రోజు, రేపు, ఎల్లుండి దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.

    రాయలసీమ :
    ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు రేపు కొన్నిచోట్ల, ఎల్లుండి ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.

    ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు భారీ ఎత్తున ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. నష్టం వివరాలు అంచనా మొత్తాన్ని లేఖలో వివరించారు. మొత్తం 4వేల 450 కోట్ల మేర ఆస్థినష్టం వాటిల్లిందని..తక్షణ సహాయంగా రూ.1000 కోట్లు విడుదల చేయాలని లేఖ ద్వారా కోరారు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ఆర్ధికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని వరదలు , భారీ వర్షాలు ముంచెత్తాయన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలని వైఎస్ జగన్ కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం కారణంగా రాష్ట్రంలో ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు భారీ వర్షాలు పడ్డాయి. ఈ నెల 13వ తేదీ ఒక్కరోజులోనే తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరంలో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.ఎగువన తెలంగాణ, మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదికి వరద పోటెత్తింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap rain, WEATHER

    తదుపరి వార్తలు