Special Trains: సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైళ్లు... పూర్తి వివరాలివే

(ప్రతీకాత్మక చిత్రం)

Sankranti Special Trains | సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లి తిరిగివచ్చే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వేకు చెందిన విజయవాడ డివిజన్ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

  • Share this:
    సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లినవారు తిరిగి హైదరాబాద్ చేరుకునేందుకు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన విజయవాడ డివిజన్ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. 2020 జనవరి 16న విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు, జనవరి 17న నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు ఈ ప్రత్యేకరైళ్లు నడుస్తాయి.

    07711 నెంబర్ గల రైలు 2020 జనవరి 16న రాత్రి 11 గంటలకు విజయవాడలో బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 06.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. దారిలో కాజిపేట స్టేషన్‌లో ఈ రైలు ఆగుతుంది. ఈ రైలులో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

    07412 నెంబర్ గల రైలు 2020 జనవరి 17న రాత్రి 08.05 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 08.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. దారిలో పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. ఈ రైలులో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

    కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    IRCTC: రైలు బయల్దేరే గంట ముందు రిజర్వేషన్ సాధ్యం... ఇదిగో సాక్ష్యం



    IRCTC Rules 2020: రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి

    Tirupati Package: తిరుపతి వెళ్తున్నారా? స్థానిక ఆలయాలు చూసేందుకు స్పెషల్ టూర్ ప్యాకేజీ
    Published by:Santhosh Kumar S
    First published: