హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Indian Railways: తెలుగు రాష్ట్రాల్లో రైళ్లు దూసుకెళ్లబోతున్నాయ్, ఈ స్టేషన్ల మధ్య తగ్గనున్న జర్నీ టైమ్

Indian Railways: తెలుగు రాష్ట్రాల్లో రైళ్లు దూసుకెళ్లబోతున్నాయ్, ఈ స్టేషన్ల మధ్య తగ్గనున్న జర్నీ టైమ్

విశాఖ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. తిరుపతి-విశాఖపట్నం-తిరుపతి ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ తిరిగి పట్టాలెక్కనుంది. బుధవారం రైల్వే శాఖ ఓ ప్రకటన చేసింది.

విశాఖ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. తిరుపతి-విశాఖపట్నం-తిరుపతి ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ తిరిగి పట్టాలెక్కనుంది. బుధవారం రైల్వే శాఖ ఓ ప్రకటన చేసింది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 110 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్లు అత్యధిక వేగంతో రైళ్లు ప్రయాణిస్తున్నాయి. దీన్ని 130 కిలోమీటర్లకు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో రైళ్లు దూసుకెళ్లనున్నాయి. రైళ్ల వేగం పెరగనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. రైళ్ల వేగం పెరిగితే ఫలితంగా ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ట్రాక్స్ బలోపేతం చేయడం, ఇతర మౌలిక వసతుల కల్పన మీద అధికారులు, సిబ్బంది పనులు చేస్తున్నారు. రైళ్ల వేగాన్ని నియంత్రించే సమస్యలను అధిగమించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గంటకు 110 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్లు అత్యధిక వేగంతో రైళ్లు ప్రయాణిస్తున్నాయి. దీన్ని గంటకు 130 కిలోమీటర్లకు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని స్వర్ణ చతుర్భుజి సెక్షన్‌లో ఈ చర్యలు చేపడుతున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో స్వర్ణ చతుర్భుజి అంటే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. బల్లార్షా - ఖాజీపేట్ - విజయవాడ - గూడూరు, విజయవాడ - విశాఖపట్నం, వాడి - గుత్తి - రేణిగుంట సెక్షన్లు ఉన్నాయి.

బల్లార్షా - ఖాజీపేట్ - విజయవాడ, ఖాజీపేట్ - సికింద్రాబాద్ మధ్య ప్రస్తుతం అనుమతించిన అత్యధిక వేగం గంటకు 120 కిలోమీటర్లు. విజయవాడ - గూడూరు, వాడి - గుత్తి - రేణిగుంట సెక్షన్ల మధ్య అది 110 కిమీ/గంటకు. ‘స్వర్ణ చతుర్భుజి మార్గాల్లో రైళ్ల వేగాన్ని పెంచడం వల్ల ప్రయాణికులు, సరుకు రవాణా మరింత సులభతరం అవుతుంది. ప్రయాణ సమయం తగ్గుతుంది. అందువల్ల మరిన్ని రైళ్లు నడపడానికి అవకాశం ఉంటుంది.’ అని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా చెప్పారు. రైళ్ల వేగం పెంచడం వల్ల సికింద్రాబాద్ - విజయవాడ మధ్య ట్రావెల్ టైమ్ భారీగా తగ్గనుందని తెలిపారు. దీనికి తగినట్టు ట్రయల్స్ కూడా నిర్వహించారు. పూర్తిస్థాయిలో ట్రయల్స్, మౌలిక సదుపాయాలు పూర్తయిన తర్వాత కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాత సికింద్రాబాద్ సర్కిల్‌లో అనుమతిపొందిన వేగంతో రైళ్లు నడపనున్నారు.

మరోవైపు ప్రస్తుతం అన్ లాక్ 5 ప్రక్రియలో భాగంగా మరికొన్ని రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయంచింది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లతో పాటు.. మరో 39 రైళ్లను నడపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక రైళ్ల కేటగిరీలోనే వీటిని నడుపనున్నారు. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. పండుగల సీజన్ ముందుండటంతో దాదాపు వచ్చే పది, పదిహేను రోజుల్లో వీటిని నడిపే అవకాశం ఉంది. ఈ రైళ్లన్నీ ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్, దురంతో, రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ లే. వీటితో పాటు రానున్న దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో పలు రూట్లలో తేజస్ రైళ్లను కూడా నడపనున్నట్టు ఐఆర్సీటీసీ ప్రకటించింది. లక్నో-ఢిల్లీ, అహ్మదాబాద్-ముంబయిల మధ్య నడిచే తేజస్ రైళ్లను ఈ నెల 17 నుంచి నడుపనున్నారు.

రైల్వే ప్రకటించిన 39 రైళ్ల జాబితాలో పలు రైళ్లు ఇవే..

లోకమాన్య తిలక్ (టి) టు హరిద్వార్ (బైవిక్లీ), లోకమాన్య తిలక్ (టి) టు లక్నో (వీక్లీ), అజ్ని టు పూణె (వీక్లీ), న్యూఢిల్లీ టు కట్ర (వీక్లీ), నిజాముద్దీన్ టు పూణె (వీక్లీ), సికింద్రాబాద్ టు షాలిమార్ (వీక్లీ), లింగంపల్లి టు కాకినాడ (వీక్లీ), హౌరా టు యశ్వంత్ పూర్ (వీక్లీ)

First published:

Tags: Andhra Pradesh, Indian Railways, South Central Railways, Telangana

ఉత్తమ కథలు