హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Train Timings: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఈ రైళ్ల టైమింగ్స్ మారాయి

Train Timings: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఈ రైళ్ల టైమింగ్స్ మారాయి

Train Timings: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఈ రైళ్ల టైమింగ్స్ మారాయి
(ప్రతీకాత్మక చిత్రం)

Train Timings: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఈ రైళ్ల టైమింగ్స్ మారాయి (ప్రతీకాత్మక చిత్రం)

Special Train Timings | ఈ రైళ్లలో ఏసీ త్రీ టైర్, ఏసీ టూటైర్, స్లీపర్ క్లాస్, చైర్ కార్ కోచ్‌లు ఉంటాయి.

పండుగ సెలవుల్లో ఎక్కడికైనా టూరెళ్తున్నారా? సంక్రాంతికి సొంతూరుకు వెళ్తున్నారా? రైలు టికెట్లు బుక్ చేసుకున్నారా? కొన్ని రైళ్ల టైమింగ్స్ మారాయి. ఈ విషయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. సంక్రాంతి సెలవుల రద్దీకి తగ్గట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్పెషల్ ట్రైన్స్ వివరాలను రైల్వే ప్రకటించింది. 2020 మార్చి వరకు ప్రకటించిన కాచిగూడ-శ్రీకాకుళం రోడ్-తిరుపతి-కాచిగూడ రూట్‌లో 07016/07479/07146 నెంబర్ గల రైళ్లను రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్త తేదీలను ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన రైళ్ల వివరాలివే.

1. కాచిగూడ-శ్రీకాకుళం రోడ్ రూట్‌లో 8 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది రైల్వే. 07016 నెంబర్ గల రైలు 2020 జనవరి 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో సాయంత్రం 06.45 గంటలకు కాచిగూడలో బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుంటుంది. మల్కాజ్‌గిరి, చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తనెపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామల్‌కోట్, అన్నవరం, తుణి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది.

2. శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి రూట్‌లో 8 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది రైల్వే. 07479 నెంబర్ గల రైలు 2020 జనవరి 8, 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 04.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్‌లో రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 09.25 గంటలకు రైలు తిరుపతికి చేరుకుంటుంది. చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామల్‌కోట్, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోల్, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది.

3. తిరుపతి నుంచి కాచిగూడకు 8 ప్రత్యైక రైళ్లు నడుస్తాయి. 07146 నెంబర్ గల రైలు 2020 జనవరి 9, 16, 23, 30, ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 05.00 గంటలకు తిరుపతిలో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 06.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కాజిపేట, జనగాం, మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

ఈ రైళ్లలో ఏసీ త్రీ టైర్, ఏసీ టూటైర్, స్లీపర్ క్లాస్, చైర్ కార్ కోచ్‌లు ఉంటాయి.

అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Zero Balance Accounts: ఈ 8 అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు

LIC Agent Recruitment: ఎల్ఐసీ ఏజెంట్‌ జాబ్‌కు అప్లై చేయండిలా... టెన్త్ పాసైతే చాలు

PAN-Aadhaar Link Status: మీ ఆధార్ నెంబర్ పాన్ కార్డుతో లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి ఇలా

First published:

Tags: Indian Railway, Indian Railways, Rail, Railway station, Railways, Srikakulam, Tirumala news, Tirupati

ఉత్తమ కథలు