స్పెషల్ రైళ్లకు సంబంధించి రెగ్యులర్ బుకింగ్ కౌంటర్లను భారతీయ రైల్వే శాఖ తెరిచింది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే తన పరిధిలోని 73 స్టేషన్లలో నేటి(22వ తేదీ) నుంచి రిజర్వేషన్ కౌంటర్లను ఓపెన్ చేసింది. అందులో తెలంగాణలోని 19 స్టేషన్లు, ఏపీలోని 43 స్టేషన్లు ఉన్నాయి. మహారాష్ట్రలోని 6 స్టేషన్లు, కర్ణాటకలోని 5 స్టేషన్లలో కూడా బుకింగ్‌ను తెరుస్తున్నట్లు పేర్కొంది.
తెలంగాణలోని స్టేషన్లు ఇవే..
సికింద్రాబాద్, హైదరాబాద్(నాంపల్లి), కాచిగూడ, వికారాబాద్, తాండూర్, కాజిపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ, కామారెడ్డి, నిజామాబాద్, రామన్నపేట్, కర్నూల్, మహబూబ్‌నగర్, కృష్ణా.
ఆంధ్రప్రదేశ్‌లోని స్టేషన్లు ఇవే..
విజయవాడ, గుంటూరు, తిరుపతి, రేణిగుంట, పిడుగురాళ్ల, నంబూరు, మంగళగిరి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, కృష్ణా కెనాల్, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామల్‌కోట, తాడేపల్లిగూడెం, అనపర్తి, పిఠాపురం, అన్నవరం, తుని, నారిపట్నం రోడ్, యలమంచిలి, అనకాపల్లి, రాయనపాడు, కొండపల్లి, చిత్తూరు, కోడూరు, ఒబులవారిపల్లె, పుల్లంపేట్, రాజంపేట్, నందలూరు, కడప, కమలాపురం, ఎర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం, తాడిపత్రి, గూటి, గుంతకల్, అధోని, మంత్రాలయం రోడ్, అనంతపూర్, ధర్మవరం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railway, Irctc, Lockdown, Special Trains