Tirupati Special Trains: తిరుమల భక్తులకు శుభవార్త... తిరుపతికి ప్రత్యేక రైళ్లు

Tirupati Special Trains | ఈ ప్రత్యేక రైళ్లల్లో ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ రైళ్లను బుక్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: January 3, 2020, 11:21 AM IST
Tirupati Special Trains: తిరుమల భక్తులకు శుభవార్త... తిరుపతికి ప్రత్యేక రైళ్లు
Tirupati Special Trains: తిరుమల భక్తులకు శుభవార్త... తిరుపతికి ప్రత్యేక రైళ్లు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివెళ్తుడంటంతో రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో రెండు ప్రత్యేక రైళ్లను నడపనుంది సౌత్ సెంట్రల్ రైల్వే. 07429 నెంబర్ గల రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుంది. 2020 జనవరి 4న శనివారం సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్‌లో ఈ రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7.00 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. 07430 నెంబర్ గల రైలు తిరుపతి నుంచి సికింద్రాబాద్ మధ్య నడుస్తుంది. 2020 జనవరి 6 సోమవారం సాయంత్రం 6.50 గంటలకు తిరుపతిలో ఈ రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లల్లో ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ రైళ్లను బుక్ చేసుకోవచ్చు. వీటితో పాటు సంక్రాంతికి ప్రకటించిన ప్రత్యేక రైళ్లు కూడా తిరుపతి వెళ్లే రైళ్లు ఉన్నాయి. ఆ రైళ్ల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నోకియా నుంచి రూ.4,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Sankranti Special Trains: సంక్రాంతి ప్రత్యేక రైళ్ల టైమింగ్స్, రూట్ల వివరాలివే...

Tirupati Local Tour: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్... ఏపీ టూరిజం నుంచి లోకల్ టూర్ ప్యాకేజీ

IRCTC Tirupathi Tour: ఐఆర్‌సీటీసీ నుంచి తిరుపతి టూర్ ప్యాకేజీ... ధర తక్కువే
First published: January 3, 2020, 11:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading