Tirupati Special Train: తిరుపతి వెళ్లేవారికి శుభవార్త... రెండు ప్రత్యేక రైళ్లు

Tirupati Special Trains | ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లల్లో జనరల్, సెకండ్ క్లాస్ కోచ్‌లతో పాటు ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

news18-telugu
Updated: November 21, 2019, 12:58 PM IST
Tirupati Special Train: తిరుపతి వెళ్లేవారికి శుభవార్త... రెండు ప్రత్యేక రైళ్లు
Tirupati Special Train: తిరుపతి వెళ్లేవారికి శుభవార్త... రెండు ప్రత్యేక రైళ్లు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త. రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. నవంబర్ 22న సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, నవంబర్ 24న తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తాయి. ఇప్పటికే తిరుపతికి వేర్వేరు రూట్లల్లో రైళ్లు ఉన్నాయి. అయితే రద్దీ పెరగడంతో ఈ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది సౌత్ సెంట్రల్ రైల్వే. 07429 నెంబర్ గల రైలు నవంబర్ 22 శుక్రవారం రాత్రి 7.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. 07430 నెంబర్ గల రైలు నవంబర్ 24 ఆదివారం సాయంత్రం 5.00 గంటలకు తిరుపతిలో బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 5.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లల్లో జనరల్, సెకండ్ క్లాస్ కోచ్‌లతో పాటు ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

Realme X2 Pro: 33 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్... రియల్‌మీ ఎక్స్2 ప్రో ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:



IRCTC: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త... ఫ్లైట్‌లో తిరుపతి టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

IRCTC Tirupathi Tour: తిరుపతి టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ... విశేషాలివే

Free Wifi: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 574 స్టేషన్లలో ఫ్రీ వైఫై... వాడుకోండి ఇలా
First published: November 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>