తనయుడి మృతి.. శవం ఇంటికి వచ్చేలోపు తల్లి మరణం

ఓ నీటి కుళాయి (నల్లా) దగ్గర గొడవ ఇద్దరి ప్రాణం తీసింది. కొడుకు చనిపోయాడని గుండెలు అవిసేలా రోదించిన ఓ తల్లి గుండెపోటుతో కన్నుమూసింది.

news18-telugu
Updated: May 5, 2019, 3:58 PM IST
తనయుడి మృతి.. శవం ఇంటికి వచ్చేలోపు తల్లి మరణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ నీటి కుళాయి (నల్లా) దగ్గర గొడవ ఇద్దరి ప్రాణం తీసింది. కొడుకు చనిపోయాడని గుండెలు అవిసేలా రోదించిన ఓ తల్లి గుండెపోటుతో కన్నుమూసింది. 24 గంటల వ్యవధిలోఒకే ఇంట్లో తల్లీకొడుకు చనిపోవడంతో ఆ గ్రామం విషాదంలో మునిగిపోయింది. కడప జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. రాజంపేటలోని కనకమ్మ వీధికి చెందిన బాలాజీ (44) అనే వ్యక్తికి, మరికొందరికి మంచినీటి నల్లా దగ్గర గొడవ వచ్చింది. ఈ క్రమంలో అవతలి వ్యక్తులు బాలాజీ మీద దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన బాలాజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ విషయం అతడి తల్లి భాగ్యమ్మ (70)కు తెలిసింది. కొడుకు మరణవార్త తెలిసిన ఆమె తల్లడిల్లిపోయింది. అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఆ తల్లి తాను బతికి ఉండగానే కొడుకు కన్నుమూయడంతో మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో ఆ తల్లి గుండె ఆగింది. ఇంకా బాలాజీ మృతదేహం ఇంటికి రాకముందే ఇంట్లో ఉన్న మరో పెద్ద దిక్కు కన్నుమూయడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: May 5, 2019, 3:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading