రైతులను క్షోభకు గురి చేయడమే.. జగన్‌ సర్కార్ తీరు సరికాదన్న సోము వీర్రాజు

ప్రభుత్వం ఇచ్చిన ఒప్పందం ప్రకారం ఇచ్చిన సమయానికి మించి 100 రోజులు గడిచాయని అందువలన రైతులు రొడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని సోము వీర్రాజు అన్నారు.

news18-telugu
Updated: August 27, 2020, 10:34 AM IST
రైతులను క్షోభకు గురి చేయడమే.. జగన్‌ సర్కార్ తీరు సరికాదన్న సోము వీర్రాజు
సోము వీర్రాజు (ఫైల్ ఫోటో)
  • Share this:
నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధాని గా అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో ప్రభుత్వం తీరు గర్హనీయమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం భూమి ఇచ్చిన ప్రతి రైతుకీ సకాలంలో వార్షిక కౌలు చెల్లించాలని ఆయన తెలిపారు. 28 వేల మందికిపైగా రైతులు తమ భూములను రాజధాని కోసం ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం సీఆర్డీయే రైతులతో చేసుకొన్న ఒప్పందం ఎకరాకీ ప్రతి ఏటా రూ.3 వేలు మెట్టకీ, రూ.5 వేలు పెంచాల్సి ఉందని తెలిపారు. కరోనా కష్ట సమయంలో సకాలంలో కౌలు చెల్లించి రైతులు ఆదుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రిని కోరారు.

బీజేపీ కూడా ప్రభుత్వానికి మానవీయ కోణంలో ఆలోచించి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేసిందని సోము వీర్రాజు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఒప్పందం ప్రకారం ఇచ్చిన సమయానికి మించి 100 రోజులు గడిచాయని అందువలన రైతులు రొడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. న్యాయం కోసం వచ్చినవారిపై నమోదు చేసిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని ,ఇంకా ఎవరినైనా విడుదల చేయకపోతే వెంటనే విడుదల చెయ్యాలని ప్రభుత్వాన్ని సోము వీర్రాజు కోరారు.

జూన్ 21వ తేదీన కౌలు రైతులకు చెల్లించాల్సిన సొమ్ము విడుదల చేస్తున్నట్లు రెండు జీవోలను జారీ చేసినా ఏ రైతు ఖాతాలోకీ జమా కాలేదన్నారు.ఆ జీవోలు వచ్చి రెండు నెలలు దాటినా సాంకేతిక కారణాలు చూపిస్తూ ఆ సొమ్ము చెల్లించకపోవడం రైతులను క్షోభకు గురి చేయడమే అవుతుందని సోము వీర్రాజు అన్నారు. ఆ కౌలు మొత్తం అడిగేందుకు సీఆర్డీయే కార్యాలయానికి వెళ్ళిన రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఖండిస్తున్నానని తెలిపారు. భూములిచ్చిన రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించి సత్వరమే పరిష్కర మార్గం చూడాలని సోము వీర్రాజు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: August 27, 2020, 10:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading