కర్నూలు జిల్లాలో దారుణం... ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం... ఏం జరుగుతోంది?

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ ఆలయాలపై ధ్వంస రచన కొనసాగుతోంది. తాజాగా ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడం పెను ప్రకంపనలకు దారితీస్తోంది.

news18-telugu
Updated: September 23, 2020, 11:17 AM IST
కర్నూలు జిల్లాలో దారుణం... ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం... ఏం జరుగుతోంది?
కర్నూలు జిల్లాలో దారుణం... ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం... (ప్రతీకాత్మక చిత్రం - credit - twitter - Vastuchitra - anupgandhe)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఓవైపు దుర్గమ్మ గుడిలో రథానికి ఉండే సింహాలు మాయమైన ఘటన కలకలం రేపుతూ... తిరుమలలో డిక్లరేషన్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతుంటే... మరోవైపు... కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన... హిందువులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలో మార్కెట్ యార్డ్ సమీపాన ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం ఉన్న ప్రదేశం నుంచి దాన్ని తొలగించి... రోడ్డుపై పడేసి వెళ్ళిపోయారు. ఈ ఘటన రాత్రివేళ జరిగినట్లు తెలిసింది. తెల్లవారు జామున రోడ్డుపై విగ్రహాన్ని చూసిన స్థానికులు... "రామ రామ... ఆంజనేయ స్వామి విగ్రహం రోడ్డుమీద ఉందేంటి... అయ్యయ్యో... ఎవరు చేశారీపని... ఎంత దారుణం... దేవుడా క్షమించు" అంటూ... విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి... అంతకు ముందు ఉండే చోటకు చేరి... అక్కడ ఉంచారు.

ఈ విగ్రహాన్ని ఎవరు ధ్వంసం చేశారో, ఎవరు రోడ్డుపై పడేశారో తేల్చాలని స్థానికులు, హిందూ ధర్మ పరిరక్షకులూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన చోట... ఎలాంటి సీసీ కెమెరాలూ లేవు. అందువల్ల ఇది ఎవరి పని అయివుంటుందో కనిపెట్టడం కష్టమవుతోంది.

ఈమధ్య ఏపీలో హిందువులతో పాటు, హిందూ దేవాలయాలు, హిందూ సంస్థల ప్రతినిధులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా ఓ కుట్ర ప్రకారం జరుగుతోందని ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తుంటే... మత పరమైన ఉద్రిక్తతలకు పురిగొల్పేందుకే... కావాలని కొందరు ఇలా చేస్తున్నారని పాలక పక్ష నేతలు అంటున్నారు. మొత్తంగా ప్రతి ఘటనలోనూ ధ్వంసమే జరుగుతోంది. ఎవరు చేస్తున్నారన్నది మాత్రం బయటరపడట్లేదు. ఈ నెలలో ఇలాంటి ఘటనలు మరింత ఎక్కువయ్యాయి. దీనిపై బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోంది. ఇవాళ సీఎం జగన్ ఇంటిని ముట్టడించాలని పిలుపు ఇవ్వడంతో... జగన్ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు.
Published by: Krishna Kumar N
First published: September 23, 2020, 11:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading