SOME GOLD FOUND AT VIJAYAWADA KANANAKA DURGAMMA TEMPLE WASHROOM POLICE SUPSPECTED LOCAL EMPLOYEES NGS GNT
Kanakadurgamma Temple: అమ్మవారి సన్నిధిలో సిబ్బంది చేతివాటం.. వాష్ రూంలో బంగారం గుర్తింపు
కనక దుర్గమ్మ గుడిలో చేతి వాటం
Kanakadurgamma Temple: ప్రముఖ ఆలయం సిబ్బంది చేతివాటాలకు బ్రేకలు పడడం లేదు.. ఇటు తిరుమల పరకామణిలో.. అటు విజయవాడ దుర్గమ్మ హుండీలోనూ సిబ్బంది దొంగతనానికి పాల్పడడం కలకలం రేపుతోంది. అంత్యంత సెక్యూరిటీ ఉందని ఆలయ అధికారులు చెబుతున్న ఇలాంటి ఘటనలు జరగడంపై భక్తులు మండిపడుతున్నారు.
Kanakadurgamma Temple: ప్రముఖ పుణ్యక్షేత్రాలంటే భక్తులకు ఎంతో నమ్మకం ఉంటుంది. పనిచేసే సిబ్బంది సైతం అక్కడి దేవతలపై నమ్మకంతో ఉంటారు.. ఎందుకంటే వారు జీవిస్తున్నదే అక్కడ వచ్చే ఆదాయంతో.. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఏపీలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (Tiruamala Tirupati Devasthanam) ఒకటి.. అలాగే బెజెవాడలో వెలసిన కనకదుర్గమ్మ దేవస్థానం (Bejawada Kanakadurgamma Temple).. కానీ ఆ రెండు పుణ్యక్షేత్రాల్లో అధికారుల.. సిబ్బంది తీరు ఎప్పుడూ వివాదాస్పందంగానే ఉంటోంది. నిత్యం ఎదో ఒక విషయంలో రెండు దేవస్థానాల సిబ్బంది తీరు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా రెండు పుణ్య క్షేత్రాల్లో సిబ్బంది చేతి వాటం కలకలం రేపింది. ఇంద్రకీలాద్రి దుర్మమ్మ ఆలయంలోని.. వాష్ రూమ్ దగ్గర బంగారాన్ని గుర్తించారు పోలీసులు.. చోరికి ప్రయత్నం చేయడంలో భాగంగానే ఆ బంగారం వాష్ రూంలో పడిపోయిందని గుర్తించారు.. అంటే ఇంకా ఎంత బంగారం దోచుకున్నారు.. నగదు కూడా మాయం చేశారా అన్నది తేలల్సి ఉంది. అదే సమయంలో తిరుమల పరకామణి (Tirumala Parakamani)లో సైతం.. ఓ ఔట్ సోర్సింగ్ సిబ్బంది చేతి వాటాన్ని విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు.. ఈ రెండు ఘటనలపై భక్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయ హుండీల లెక్కింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. మహామండపం ఆరో అంతస్థులో అమ్మవారి హుండీల్లోని కానుకల లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో బంగారు ఆభరణాలను అపహరించేందుకు సిబ్బంది ప్రయత్నించినట్టు అధికారులు గుర్తించారు. ఎస్పీఎఫ్ తనిఖీల్లో నల్లపూసల చైన్, ఒక ఉంగరం, రెండు గిల్టు ఉంగరాలు, బుట్ట దుద్దులు బయటపడడంతో షాక్ తిన్నారు.
మహామండపం దగ్గర ఉన్న వాష్ రూమ్ లో ఈ బంగారాన్ని పోలీసులు గుర్తించారు. అపహరించేందుకు యత్నించిన బంగారం విలువ దాదాపు ఐదు గ్రాములపైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి విలువ 6 వేల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఎస్పీఎఫ్ పోలీసులు ఆకస్మిక తనిఖీల్లో గుర్తించిన బంగారాన్ని ఎవరు దొంగిలించారనే విషయంపై అంతర్గతంగా విచారణ జరుపుతున్నారు.
దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం హుండీలను సిబ్బంది సోమవారం లెక్కించారు. 41 హుండీల్లో 19 రోజుల్లో వచ్చిన కానుకలను లెక్కించగా 2.64 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. పది గంటల పాటు దేవస్థానం సిబ్బందితోపాటు సేవా సంస్థల సభ్యులు కానుకలను లెక్కించారు. 586 గ్రాముల బంగారం, 6.060కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు. కేవలం విజయవాడ దుర్గమ్మ సన్నిధఇలోనే కాదు..
తిరుమలలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో పరకామణి మండపంలో చిల్లర నాణేలు., కరెన్సీ నోట్లను లెక్కిస్తుంటారు. కరెన్సీ లెక్కింపుకు శాశ్వత., రిటైర్డ్ ఉద్యోగులచే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పరకామణి మండపంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సైతం విధులు నిర్వహిస్తుంటారు. అయితే శ్రీవారికీ భక్తులు సమర్పించే కానుకలను లెక్కింపు చేసే పరకామణి మండపంలో కరెన్సీ నోట్లు చోరికి గురయ్యాయి. పరకామణి మండపంలో పని చేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ చోరికి పాల్పడినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు సాక్ష్యాలతో సహా నిర్ధారణకు వచ్చారు. చోరికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా విజిలెన్స్ అధికారులకు దిమ్మ తిరిగే విషయాలు బయట పడ్డాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.