SOLO BRATHUKE SO BETTER HERO SAI DHARAM TEJ DONATION FOR OLD AGE HOME IN VIJAYAWADA BA GNT
Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ పెద్ద మనసు, విజయవాడలో వృద్ధాశ్రమానికి విరాళం
విజయవాడలో వృద్ధాశ్రమానికి సాయి ధరమ్ తేజ్ విరాళం
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెద్ద మనసు చాటుకున్నాడు. విజయవాడలో ఓ వృద్ధాశ్రమానికి విరాళం ఇచ్చాడు. విజయవాడలోని వృద్ధాశ్రమానికి స్వయంగా వెళ్లిన సాయి ధరమ్ తేజ్ వారికి ఆర్థిక సాయం చేశాడు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెద్ద మనసు చాటుకున్నాడు. విజయవాడలో ఓ వృద్ధాశ్రమానికి విరాళం ఇచ్చాడు. విజయవాడలోని వృద్ధాశ్రమానికి స్వయంగా వెళ్లిన సాయి ధరమ్ తేజ్ వారికి ఆర్థిక సాయం చేశాడు. విజయవాడ నగరంలోని వాంబేకాలనీ అమ్మ ప్రేమ ఆదరణ వృద్ధాశ్రమాన్ని సాయి ధరమ్ తేజ్ సందర్శించాడు. ఆ వృద్ధాశ్రమానికి రూ.6 లక్షలు విరాళం ఇచ్చాడు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం విజయవాడ వచ్చిన సాయి ధరమ్ తేజ్ వృద్ధాశ్రమం లోని వృద్దులని కలవటానికి రావటంతో ఆశ్రమం చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన స్ధానికులు అక్కడకు వచ్చారు. ‘అభిమానులు ఇలా విజయవాడ లో వృద్ధాశ్రమానికి సాయం చేయమని కోరారు. నా వంతు సాయం చేయడమే కాకుండా నా స్నేహితుల సాయం కూడా అందించాం. మున్ముందు రోజులలో అభిమానుల సహకారంతో మరిన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నాం. కరోనా అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా సినిమా హాళ్ళకు అనుమతి ఇవ్వటం హర్షణీయం. త్వరలో నేను నటించిన సినిమా సోలో బతుకే సోబెటర్ విడుదల కానుంది. పైరసీని తరిమికొట్టి హాళ్ళలో సినిమాలు చూసి ఆదరించండి.’ అని సాయి ధరమ్ తేజ్ విజ్ఞప్తి చేశాడు.
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా తర్వాత సాయితేజ్ రెండు సినిమాలను కమిట్ అయ్యున్నాడు. అందులో దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా. ఇందులో ఇప్పటికే హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారు. ఇక మిగిలిన రెండో సినిమా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కనుంది. మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన లుక్‌ను యూనిట్ విడుదల చేసింది. ఓ కన్ను, షట్చక్రంతో టైటిల్ లుక్ ఆసక్తిని రేపేలా ఉంది. ఈ సినిమాలో సాయితేజ్ జోడీగా కీర్తిసురేశ్ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. సాధారణంగా మెగా క్యాంప్‌లో ఓ హీరోయిన్ అడుగు పెడితే .. ఆ హీరోలే తమ సినిమాల్లో సదరు హీరోయిన్‌కు అవకాశాలు ఇస్తారు. కీర్తి విషయంలోనూ అదే ఫార్ములా వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
మరో వైపు దేవాకట్టా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించనున్నారు. ఇందులో సాయితేజ్ యంగ్ ఐఏయస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు ఆరు డిజాస్టర్స్ తర్వాత సాయితేజ్ గత ఏడాది రెండు సూపర్‌హిట్స్‌ను దక్కించుకున్నాడు. అందులో ముందుగా చిత్రలహరి ఉంది. ఆ తర్వాత వచ్చిన ప్రతిరోజూ పండుగే చిత్రం సాయితేజ్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. మరి ఈ సక్సెస్‌ను సోలో బ్రతుకే సో బెటర్ చిత్రంతో సాయితేజ్ కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి. ఇందులో నభా నటేశ్ హీరోయిన్గా నటిస్తుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.