హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

తిరుపతిలో దారుణం... మంటల్లో కారు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య?

తిరుపతిలో దారుణం... మంటల్లో కారు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య?

నాగరాజు (File Image)

నాగరాజు (File Image)

తిరుపతిలో దారుణం జరిగింది. ఓ కారు మంటల్లో కాలిపోయిది. అందులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య జరిగినట్లు తెలుస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తిరుపతి జిల్లా చంద్రగిరిలోని గంగుడుపల్లెలో దారుణం జరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నాగరాజు హత్య జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి. బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజు.. తిరుపతి నుంచి వెళ్తుండగా... గంగుడుపల్లె దగ్గర ఆయన కారు మంటల్లో కాలి బూడిదైంది. నాగరాజు ఆ కారులోనే సజీవ దహనం అయ్యాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలికి వెళ్లి చూడగా.. అక్కడ నాగరాజు గోల్డ్ చైన్, చెప్పులు పోలీసులకు లభించాయి.

దీనిపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు.. ఇది హత్య లేక ఆత్మహత్యా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. గత రాత్రి ఏదో గొడవ జరిగిందనీ.. ఆ తర్వాత నాగరాజు కారులో బయలుదేరాడని తెలుస్తోంది. అందువల్ల ఇది హత్య కావచ్చనే అనుమానాలు ఉన్నాయి. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మరణ వార్త తెలుసుకొని వారంతా కన్నీటి సంద్రమయ్యారు.

First published:

ఉత్తమ కథలు