హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Shocking: ఛార్జింగ్ లో ఉండగా ల్యాప్ టాప్ వాడుతున్నారా..? ఈ వార్త మీకోసమే..! పాపం సుమలత..

Shocking: ఛార్జింగ్ లో ఉండగా ల్యాప్ టాప్ వాడుతున్నారా..? ఈ వార్త మీకోసమే..! పాపం సుమలత..

కడప జిల్లాలో ల్యాప్ టాప్ పేలి యువతికి గాయాలు

కడప జిల్లాలో ల్యాప్ టాప్ పేలి యువతికి గాయాలు

Kadapa News: చాలామంది అత్యవసర పరిస్థితిల్లో తన అవసరాలకు అనుగుణంగా ల్యాప్ టాప్ (Laptop) ను ఛార్జెర్ ప్లగ్ కు కనెక్ట్ చేసి... అలాగే వాడేస్తున్నారు. అది ఎంత ప్రమాదమో ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఇదే పరిస్థితి ఓ యువతి ప్రాణాలమీదకు తెచ్చింది.

ఇంకా చదవండి ...

GT Hemanth Kumar, News18, Tirupati

కాలం మారుతున్న కొద్దీ కంపెనీల్లో విధులు నిర్వహించే విధానంలో మార్పులు వస్తున్నాయి. కరోనా కారణంగా గత రెండేళ్ల పాటు వర్క్ ఫ్రొమ్ హోమ్ విధానాన్ని అమలు చేసాయి. కరోనా ఉపద్రవం ప్రారంభం కాగానే ప్రముఖ ఐటి కంపెనీల నుంచీ చిన్న చిన్న కంపనీల వరకు వర్క్ ఫ్రొమ్ హోమ్ పద్ధతిని ఇప్పటికీ కొనసాగిస్తూ వస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) విధానం అమలు అయినా నాటి నుంచి అధికంగా ల్యాప్-టాప్, మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అధికంగా వాడటం చాల ఎక్కువ అవుతూ వస్తోంది. ఎలక్ట్రానిక్ పరికరాలకు కచ్చితంగా ఛార్జింగ్ ఉండాలి. ఒకవేళ ఛార్జింగ్ లేకుంటే ఇంట్లోని ప్లగ్ పాయింట్ కు కనెక్ట్ చేసి ఫుల్ ఛార్జ్ అయినా అనంతరం మళ్లీ వినియోగించాలి.

కానీ చాలామంది అత్యవసర పరిస్థితిల్లో తన అవసరాలకు అనుగుణంగా ల్యాప్ టాప్ ను ఛార్జెర్ ప్లగ్ కు కనెక్ట్ చేసి... అలాగే వాడేస్తున్నారు. అది ఎంత ప్రమాదమో ఎన్నో సందర్భాల్లో రుజువైంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని వైఎస్ఆర్ కడప జిల్లా (YSR Kadapa District)) లో ఛార్జింగ్ పెట్టిన ల్యాప్-టాప్ వాడుతూ విద్యుత్ ఘాతుకానికి గురైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.... కడప జిల్లా బీ కోడూరు మండలం మేకవారి పల్లెకు చెందిన సుమలత విద్యాభ్యసాన్ని పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తుంది. కరోనా ఉపదృవం ముంచుకొచ్చిన నేపథ్యంలో ప్రతి కంపెనీలాగానే సుమలత పనిచేస్తున్నమ్యాజిక్ టెక్ సొల్యూషన్ కంపెనీ వర్క్ ఫ్రామ్ హోమ్ కేటాయించారు.

ఇది చదవండి: ఏపీలో ఉప్పెన తరహా సీన్.. కూతురు వెంటపడుతున్నాడని యువకుడి మర్మాంగం చితక్కొట్టిన తండ్రి..? 


గత కొంత కాలంగా ఇంటి వద్దనే ఉంటూ కార్యాలయ విధులను నిర్వహిస్తూ వస్తుంది. ప్రతి రోజు మాదిరిగానే.. ల్యాప్-టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉంది. మధ్యలో ల్యాప్-టాప్ ఛార్జింగ్ 10% కు చేరుకోవడంతో వెంటనే ఛార్జింగ్ కేబుల్ కనెస్ట్ చేసింది. కొంత సేపు అలానే వర్క్ చేస్తూ ఉండటంతో ల్యాప్ టాప్ ఒక్కసారిగా హీట్ ఎక్కడం ప్రారంభించింది. లో-ఓల్టేజ్ నుంచి అమాంతం హై ఓల్టేజ్ రావడంతో ఒక్కసారిగా ల్యాప్-టాప్ నుంచి మంటలు వచ్చాయి. అలాగే ల్యాప్ టాప్ తో వర్క్ చేస్తుండటంతో ఆమెకు కూడా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో సుమలతకు తీవ్రంగా కాలిన గాయాలు అయ్యాయి. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు 108 సహాయంతో కడప సన్ రైస్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉదని వైద్యులు తెలిపారు. సుమలత దేహంలో 40% మేర కాలిన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

First published:

Tags: Andhra Pradesh, Kadapa, Laptop

ఉత్తమ కథలు