Home /News /andhra-pradesh /

SNAKE TAKING REVENGE ON FAMILY AS SNAKE BITES THEM FOR EVERY TWO DAYS IN CHITTOOR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Snake revenge: పాములు నిజంగానే పగబడతాయా..! ఇదిగో ప్రూఫ్ అంటున్న కుటుంబం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Snake: పాము ఇంటికి వస్తే పగబట్టే వచ్చిందంటూ హడలిపోతుంటారు. పాములు పగబట్టవనేదానికి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లోని ఓ పల్లెలో మాత్రం ఓ పాము.. ఓ కుటుంబాన్ని పగబట్టిందట. ఆ ఇంట్లోని వాళ్లు తరచూ పాముకాటుకు గురవుతుండటంతో నిజంగానే నాగరాజు వారిని వెంబడిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, Tirupathi, News18

  పాములంటే అందరికి భయమే. కోరలు చాచి కాటు వేస్తే చాలు ప్రాణాల మీదకు వస్తుంది. ఐతే పాములు పగడపట్టి కాటువేస్తాయని అందరూ భావిస్తారు. శాస్త్రవేత్తలు అలాంటిదేమీ లేదని చెప్పినా.. పాము ఇంటికి వస్తే పగబట్టే వచ్చిందంటూ హడలిపోతుంటారు. పాములు పగబట్టవనేదానికి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. పాములకు జ్ఞాపకశక్తి తక్కువని అందుకే అవి పగబట్టవని.. వాటికి చెవులు కూడా ఉండవని అందుకే మాటలను గ్రహించి వెంటాడే అవకాశమే లేదని చెబుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ పల్లెలో మాత్రం ఓ పాము.. ఓ కుటుంబాన్ని పగబట్టిందట. ఆ ఇంట్లోని వాళ్లు తరచూ పాముకాటుకు గురవుతుండటంతో నిజంగానే నాగరాజు వారిని వెంబడిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే... చిత్తూరు జిల్లా (Chittoor District) తిరుపపతి సమీపంలోని ధోర్ణకంబాల ఎస్టీకాలంలో వెంకటేష్ వెంకటమ్మ అనే దంపతులు నివాసముంటున్నారు. వారు కుమారుడు జగదీష్, తండ్రి గురవయ్యతో కలిసి ఉంటున్నారు. గ్రామ పొలిమేరల్లో గుడిసె వేసుకొని ఊరూరా తిరుగుతూ బండిపై ఐస్ క్రీమ్ అమ్ముకొని జీవిస్తున్నారు. ఐస్ క్రీమ్ బండి తీయని సమయంలో కూలిపనులకు వెళ్తుండేవాడు. ఆ డబ్బుతోనే కుమార్తెతో పాటు కొడుకుని చదువిస్తున్నాడు.

  ఐతే వీరి జీవితంలో అనుకోని ఘటన ఎదురైంది. వెంకటేష్ తన ఇంటి ఆవరణలో కూరయాగలు, పూలమొక్కలు నాటి పెంచుతున్నాడు. ఓ రోజు మొక్కల దగ్గర శుభ్రం చేస్తుండగా కత్తి చేతులో నుంచి జారి పాముపై పడింది. దీంతో అది అక్కడి నంచి వెళ్లిపోయింది. ఐతే పాము విషయాన్ని వెంకటేష్ పెద్దగా పట్టించుకోలేదు. ఇది జరిగిన కొన్ని రోజులకు రాత్రి అందరూ నిద్రిస్తుండగా ఇంటికి వచ్చిన పాము గుమ్మంలో నిద్రిస్తున్న గురవయ్యను కాటు వేసింది. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది.

  ఇది చదవండి: ఏపీలో అరకు, పాడేరుకు ధీటుగా మరో టూరిజం స్పాట్.. అభివృద్ధికి కేంద్రం నిధులు.. విశేషాలివే..!


  ఆ రోజు నుంచి నెల రోజుల వ్యవధిలో దాదాపు తొమ్మిది సార్లు ఒకరి తరువాత ఒకరిని పాము కాటు వేయడం ఆసుపత్రిలో చేరడం అదే తంతుగా మారిపోయింది. గత నెలలో వెంకటేష్, వెంకటమ్మ, గురవయ్యలను రెండేసి సార్లు కాటు వేయగా.. జగదీష్ ను మూడు సార్లు కాటు వేసింది. పాము కాటు వేసి ప్రతిసారి స్థానికులు సకాలంలో స్పందించి 108కు కాల్ చేయడం హాస్పిటల్ కు తరలించడం వారు ప్రాణాలతో బయటపడటం జరుగుతున్నాయి. పదిరోజుల క్రితం వెంటమ్మ, జగదీష్ ఒకేసారి పాముకాటుకు గురై ఆస్పత్రిలో చేరారు. రెండురోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవగా.. అదేరోజు రాత్రి మళ్లీ పాముకాటు వేసింది. మళ్లీ వారిని రుయా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

  ఇది చదవండి: పొట్టిదైనా చాలా గట్టిదే..! పుంగనూరు ఆవుల స్పెషాలిటీ ఇదే.. ధర ఎంతంటే..!


  దీనిపై వేంకటేష్ మాట్లాడుతూ.. ఏ కర్మో ఏమో గానీ దేవుడు ఏలా పెడితే అలానే జరుగుతుందని తీవ్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అసలు పాము ఎందుకు తమ కుటుంబంపైనే పగ పట్టిందో తమకు ఏమాత్రం అర్ధం కావడం లేదంటున్నారు. ఒకే పాము తమను కాటు వేస్తుందా..వేరే వేరే పాము ఏమైనా కాటు వేస్తుందా అనేది తమకు తెలియడం లేదని, తెల్లవారి జామునో, అర్ధరాత్రి సమయంలోనూ పాము కాటు వేస్తుందని,కాటుకు గురైనా ప్రతిసారి తనతో పాటు తన కుటుంబం మొత్తం నరకయాతనం అనుభవిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గానీ తమపై దయతలచి ఓ చిన్నపాటి ఇంటిని నిర్మించి ఇస్తే తమకు ఎంతో మేలుచేసిన వారవుతారని వేడుకుంటున్నాడు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Snake, Tirupati

  తదుపరి వార్తలు