కారు ఇంజిన్‌లో దూరిన పాము...తిరుమలలో కలకలం

చివరకు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది చేరుకొని చాకచక్యంగా పామును బయటకు తీశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

news18-telugu
Updated: June 27, 2019, 6:12 PM IST
కారు ఇంజిన్‌లో దూరిన పాము...తిరుమలలో కలకలం
పామును బయటకు తీస్తున్న అటవీశాఖ సిబ్బంది
  • Share this:
తిరుమలలో ఓ పాము కలకలం రేపింది. నిలిపి ఉన్న కారు బ్యానెట్‌లోకి దూరి ఇంజిన్ దగ్గర తలదాచుకుంది. ఐతే పాము తోకభాగం బయటకు కనిపించడంతో కంగారుపడిన డ్రైవర్.. దాన్ని బయటకు తరిమేందుకు స్థానికులతో కలిసి ప్రయత్నించాడు. కానీ పాము మాత్రం బయటకు రాలేదు. చివరకు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది చేరుకొని చాకచక్యంగా పామును బయటకు తీశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కారులో పాము కనిపించడంతో సమీపంలోని భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఐతే తిరుమలలో దట్టమైన అటవీ ప్రాంతముంది. అలాంటి చోట్ల పాములు, అడవి జంతువులు సంచరించడం సాధారణమేనంటున్నారు అటవీశాఖ అధికారులు. భక్తులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని...ఒంటరిగా వెళ్లకుండా గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు.

వీడియో ఇక్కడ చూడండి:First published: June 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు