Home /News /andhra-pradesh /

SMART GAS CYLINDERS ARE AVAILABLE IN MARKET HERE IS THE PRICE AND PROCESS OF BOOKING FULL DETAILS HERE PRN VSP

Smart Gas Cylinders: మహిళలకు గుడ్ న్యూస్.. వంట చేసేటప్పుడు భయపడనక్కర్లేదు.. ఇకపై అంతా స్మార్ట్..

స్మార్ట్ గ్యాస్ సిలిండర్లు

స్మార్ట్ గ్యాస్ సిలిండర్లు

LPG Gas: ప్రస్తుతం స్మార్ట్ యుగం నడుస్తోంది. స్మార్ట్ ఫోన్ నుంచి స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఏసీ ఇలా అన్నింటా స్మార్ట్ నామమే జపిస్తున్నారు. ఇప్పుడు కిచెన్ లోకి కూడా స్మార్ట్ గా స్మార్ట్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. స్మార్ట్ కిచెన్ కు మరిన్ని హంగులిచ్చేలా స్మార్ట్ సిలిండర్లు రాబోతున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India
    P. Anand Mohan, News18, Visakhapatnam

    ప్రస్తుతం స్మార్ట్ యుగం నడుస్తోంది. స్మార్ట్ ఫోన్ (Smart Phone) నుంచి స్మార్ట్ టీవీ (Smart TV), స్మార్ట్ ఏసీ ఇలా అన్నింటా స్మార్ట్ నామమే జపిస్తున్నారు. ఇప్పుడు కిచెన్ లోకి కూడా స్మార్ట్ గా స్మార్ట్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. స్మార్ట్ కిచెన్ కు మరిన్ని హంగులిచ్చేలా స్మార్ట్ సిలిండర్లు రాబోతున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో ఫైబర్‌తో వీటిని తయారు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇప్ప టికే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై ఇలా పెద్ద నగరాల్లో కొన్నినెలల క్రితం వినియోగంలోకి తీసుకొచ్చి ప్రయోగం చేసింది. అక్కడ సక్సెస్‌ కావడంతో ఇప్పుడు దేశమంతా ఈ ఫైబర్‌ స్మార్ట్‌ గ్యాస్‌ సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ రకం సిలిండర్లను ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇకపై వంటింట్లో సిలిండర్లు పేలుతున్నా యన్న భయాలు కూడా ఉండవట.

    ప్రస్తుతం అన్ని చోట్ల ఐరన్ సిలిండర్లు వాడుతున్నారు. దీంతో అవి ఎంతో భారంగా మారుతున్నాయి. ఖాళీ సిలిండర్ మోసుకెళ్లాలన్నా హైరానా తప్పదు. అలాగే వాటిలో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవడం కష్టం. ఐరన్ సిలిండర్ ఖాళీది అయితేనే 16 కిలోల బరువుంటుంది. అదే ఫైబర్ సిలెండర్ అయింతే కేవలం 6.3 కిలోలు మాత్రమే ఉంటంది. ఫైబర్‌ సిలిండర్‌లో ఎంతగ్యాస్‌ ఉందో సుల భంగా తెలుసుకోవచ్చు. కొత్త సిలిండర్‌ లోపలి భాగం గోడలు ఫైబర్‌ తో మూడు వరుసలుగా తయారు చేయడంతో తీవ్ర ఒత్తిడిని తట్టు కుంటుంది. గ్యాస్‌ ఒత్తిడి అధికమైతే సిలిండర్‌ లోపలి భాగంలో ఉండే గోడలు మెత్తబడతాయి. తద్వారా పేలే అవకావం తక్కువగా ఉంటుంది. ఇనుప సిలిండర్లు తుప్పుపట్టే అవకాశముంటుంది.. ఫైబర్ సిలిండర్ల విషయంలో ఆ తలనొప్పులుండవ్.

    ఇది చదవండి: యాపిల్ తో పోటీపడుతున్న జామకాయ.. ఒక్కసారి పంటవేస్తే అంత లాభమా..?


    ఏపీలో రెండు రకాల ఫైబర్‌ సిలిండర్లను ఐవోసీ సంస్థ అందుబాటులోకి తీసుకువస్తోంది. పది కిలోల సిలిండర్‌కు రూ.3,350, ఐదు కిలోల సిలిండర్‌కు రూ.2,150 చొప్పున డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. రూ.778 చెల్లించి పది కిలోల సిలిండర్‌ను రూ.406 చెల్లించి ఐదు కిలోల సిలిండర్‌ల్లో గ్యాస్‌ రీఫిల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాడుతున్న ఐరన్ సిలిండర్ ను ఇచ్చేస్తే గతంలో చెల్లించిన డిపాజిట్ తిరిగి ఇచ్చేస్తారు. కొత్త డిపాజిట్ చెల్లించి ఫైబర్ సిలిండర్ తీసుకోవలి ఉంటుంది.


    ఇది చదవండి: ఈ యాప్ చేతిలో ఉంటే చాలు.. ఎవరికీ, దేనికి భయపడక్కర్లేదు..


    ఇప్పటికే బెంగళూరు, కడప, కర్నూలు, హిందూపురం ప్రాంతాల్లో ఫైబర్ సిలిండర్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఫైబర్‌ గ్యాస్‌ సిలిండర్‌ ప్లాంట్‌ ఏర్పాటు కాబోతోంది. దీంతో కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం ప్రాంతాల్లో స్మార్ట్‌ గ్యాస్‌ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, LPG Cylinder

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు