SIX YEARS OLD BOY SUSPICIOUS DEATH WITHIN 24 HOURS AFTER ABSCONDING IN TADEPALLI GUNTUR DISTRICT HSN
ఆరేళ్ల కొడుకు.. కనిపించకుండా పోయిన 24 గంటల్లోనే ఇంటికి దగ్గరలోని పొలంలో నిర్జీవంగా.. అసలేం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
పోలీసులు రంగంలోకి దిగి ఆ బాలుడి ఆచూకీ తెలుసుకునేలోపే వారికి ఓ దారుణ వార్త తెలిసింది. ఇంటికి దగ్గరలోనే పొలంలోనే ఆ బాలుడు విగతజీవిగా పడి ఉన్నాడన్న వార్త వాళ్లకు తెలిసింది.
ఆరేళ్ల వయసున్న కొడుకు. సడన్ గా ఇంట్లోంచి కనిపించకుండా పోయాడు. ఆడుకుంటూ ఆడుకుంటూనే అదృశ్యమయ్యాడు. కొడుకు కనిపించడం లేదని ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. స్నేహితులు, బంధువులు ఎవరైనా తీసుకెళ్లి ఉంటారేమోనని ఆరా తీశారు. ఎవరి వద్దా లేడని తెలిసి మరింత టెన్షన్ పడ్డారు. చివరకు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి ఆ బాలుడి ఆచూకీ తెలుసుకునేలోపే వారికి ఓ దారుణ వార్త తెలిసింది. ఇంటికి దగ్గరలోనే పొలంలోనే ఆ బాలుడు విగతజీవిగా పడి ఉన్నాడన్న వార్త వాళ్లకు తెలిసింది. అంతే పరుగు పరుగున అక్కడకు ఆ తల్లిదండ్రులు వెళ్లి చూశారు. నిర్జీవంగా పడి ఉన్న కొడుకును చూసి కుప్పకూలిపోయారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మెల్లంపూడిలో భాగవానియా నాయక్, అమల దంపతులకు ఇద్దరు కొడుకులు. ఈ దంపతుల రెండో కుమారుడు, ఆరేళ్ల భార్గవ తేజ ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. బంధువులు, స్నేహితులు ఎవరైనా తీసుకుని వెళ్లి ఉంటారని మొదట్లో ఆ తల్లిదండ్రులు భావించారు. కానీ ఎవరిని కనుక్కున్నా తమకు తెలియదని అంటుండటంతో వారిలో ఆందోళన పెరిగింది. కొడుకు కనిపించకుండా పోవడంతో వారిలో టెన్షన్ పెరిగింది. చివరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు ఆ భార్యాభర్తలిద్దరూ వెళ్లారు. తమ కొడుకు అదృశ్యం గురించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఆ తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్ తెలిసింది. వారి ఇంటికి కాస్త దగ్గరలోనే పొలాల్లో ఆ ఆరేళ్ల బాలుడు విగతజీవిగా పడి ఉన్నాడు. తల్లిదండ్రులు ఆ వార్త తెలిసి ఉరుకులు పరుగుల మీద అక్కడకు చేరుకున్నారు. బాలుడిని నిర్జీవంగా చూసి కన్నీటిపర్యంతమయ్యారు. అయితే బాలుడి దేహంపై గాయాల గుర్తులు ఉండటంతో ఎవరో హత్య చేసి, అక్కడ పడేసి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతడిని ఎవరు చంపి ఉంటారు? ఏం జరిగి ఉంటుందన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.