సత్యసాయి జిల్లా (Sathyasai District) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బొలెరో, ఆటో ఢీకొని ఆరుగురు మరణించారు. బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్ద శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆటో, బెలెరో చాలా వేగంతో ఎదురెదురుగా ఢీకొనడంతో.. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్పాట్‌లోనే ఐదుగురు మరణించారు. మరొకొరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Road accident