SIX MONTHS PREGNANT WOMAN TAKE HER LIFE AFTER SELFIE VIDEO DUE TO DOWRY HARASSMENT HSN
రెండో పెళ్లి.. ఆరు నెలల గర్భవతి.. ఉత్తరం రాసి, ఫేస్ బుక్ లో వీడియోను పోస్ట్ చేసి మరీ..
ప్రతీకాత్మక చిత్రం
భార్యాభర్తల మధ్య తరచూ విబేధాలు రావడంతో ఆమె నాలుగేళ్ల క్రితం పుట్టింటికి వచ్చేసింది. భర్తతో విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించింది. ఇరు కుటుంబాల అంగీకారంతోనే వారిద్దరూ పెళ్లి చేసుకున్నా..
చిన్న వయసులోనే ఆమెకు పెళ్లయింది. తెలిసీ తెలియని వయసులోనే ఓ వ్యక్తికి భార్యగా మారింది. అక్కడ భర్తతో కష్టాలు పడలేక కొన్నాళ్లకే వారి మధ్య బంధం తెగిపోయింది. ఆ భార్యాభర్తలిద్దరూ పరస్పరం విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఆమె పుట్టింటికి చేరకుంది. అక్కడే ఓ వ్యక్తిని ఇష్టపడింది. ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ రూపాయి కూడా కట్నం తీసుకురాలేదని కట్టుకున్న వాడి కుటుంబ సభ్యులు ఆమెపై నిత్యం వేధింపుల పర్వాన్ని మొదలుపెట్టారు. అత్తమామలే కాదు ఆ కుటుంబంలోని ప్రతీ వ్యక్తీ ఆమెను మాటలతో చిత్రహింసలకు గురిచేసేవారు. దీన్ని ఆమె భరించలేకపోయింది. ఆరు నెలల గర్భవతి అయినా వేధింపులు ఆగకపోవడంతో ఆమె తీవ్ర మనస్థాపం చెందింది. చివరకు ఓ లేఖను రాసి, ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసి మరీ ఆమె ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లాలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం జిల్లా అమరాపురం మండలం నిద్రఘట్ట గ్రామానికి చెందిన అప్పన్నగౌడ, ఉమాదేవి అనే భార్యాభర్తలకు 22 ఏళ్ల శోభ అనే కూతురు ఉంది. ఆమెకు 17ఏళ్ల వయసులోనే మేనమామ వరసయ్యే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఆ భార్యాభర్తల మధ్య తరచూ విబేధాలు రావడంతో ఆమె నాలుగేళ్ల క్రితం పుట్టింటికి వచ్చేసింది. భర్తతో విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇరు కుటుంబాల అంగీకారంతోనే వారి ప్రేమ పెళ్లి జరిగింది. ప్రస్తుతం శోభ శ్రీనివాస్ దంపతులకు మూడేళ్ల కొడుకు ఉన్నాడు. శోభ ఆరు నెలల గర్భవతి.
అయితే పెళ్లి సమయంలో శోభ ఎలాంటి కట్నకానుకలు తీసుకురాకపోవడంపై అత్తమామలు ఆమెపై కక్ష కట్టారు. ఆమెను నిత్యం వేధించేవారు. ఎక్కడికైనా వెళ్లి చావు అంటూ సూటిపోటి మాటలతో చిత్రహింసలకు గురిచేసేవారు. అత్తమామలే కాకుండా ఆ కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ ఆమెను నానా మాటలు అనేవారు. దీన్ని భరించలేక ఆమె ఆదివారం రోజున శనివారం గల కారణాలను ఓ ఉత్తరంలో రాసింది. అంతే కాకుండా ఓ సెల్ఫీ వీడియోను ఫోస్ బుక్ లో పోస్ట్ చేసి ఉరి వేసుకుని చనిపోయింది. అత్తమామలు, బావ, తోడికోడలు, మరిదే తన ఆత్మహత్యకు కారణమంటూ ఆ లేఖలో, వీడియోలో రాసిపెట్టింది. శోభ తల్లి ఉమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.
Published by:Hasaan Kandula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.