అదో నేషనల్ హైవే. నిత్యం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఒక్కో వాహనం కనీసం గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంటాయి. ఎదురెళ్లే వాహనం పొరబాటున బ్రేక్ వేసిందో పెద్ద ప్రమాదం తప్పదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) కొవ్వూరు గమన్ బ్రిడ్జిపై ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఒకటికాదు రెండుకాదు ఏకంగా ఆరు భారీ వాహనాలు ఒకదానిని ఒకటి ఢీ కొట్టుకున్నాయి. ఈ వాహనాల మధ్య ఓ కారు ఆటబొమ్మలా నుజ్జునుజ్జైంది. శనివారం కొవ్వూరు గమన్ వంతెనపై జరిగిన ప్రమాదం తీవ్ర ఆదోళన రేకేత్తిస్తోంది. ఢీ కొన్న ఆరువాహనాల్లో రెండు వాహనాలు ప్రమాదకరమైన రసాయనాలను తీసుకెళ్తున్నాయి.
రెండు లారీలలో ఉన్న ట్రై క్లోరో ఫాస్పేట్, మిథనాల్ డై క్లోరైడ్ వల్ల ప్రజలకు హాని కలగకుండా కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది, ఆంధ్రా షుగర్స్ భద్రతా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. భారీ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం జరుగుతుందని అందరూ భావించారు.
ఐతే వాహనాల్లో ఉన్నవారంతా గాయాలతో బయటపడ్డారు. గాయపడ్డవారిని కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం ఉదయం ప్రమాదం జరగడంతో అలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రమాదానికి గురైన ఆరు వాహనాల్లో ముందు వెళ్తున్న టిప్పర్ సడెన్ బ్రేక్ వేయడం వల్ల యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. టిప్పర్ కు భారీ కంటైనర్ కు మధ్య ఓ కారు నుజ్జునుజ్జైంది. అదృష్టవశాత్తూ కారులోని వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఐతే బ్రిడ్జికి సమీపంలోని టోల్ గేట్ వద్ద ఫాస్ట్ ట్రాక్ లేకపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభిస్తోందని.. వాహనాలు కూడా దగ్గరదగ్గరగా వెళ్లాల్సి రావడంతో ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదాల సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులంటున్నారు. ఇప్పటికైనా కొవ్వూరు గమన్ టోల్ గేట్లో ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేసి, సరిపోయినంత సిబ్బందిని అందుబాటులో ఉంచేలా అధికారులు, స్థానిక నేతలు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
AP News: హైవేపై ఆరు వాహనాలు ఢీ.. బొమ్మలా నలిగిపోయిన కారు.. రోడ్డుపై షాకింగ్ సీన్..#ACCIDENT #WestGodavari #roadaccident pic.twitter.com/DGH2n2qC39
— News18 Telugu (@News18Telugu) March 26, 2022
చిత్తూరు జిల్లాలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ బెనిఫిట్ షోకి వెళ్తున్న యువకులు వీ.కోట సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. రామకుప్పం ప్రాంతానికి చెందిన యువకులు ఆర్ఆర్ఆర్ సినిమా బెనిఫిట్ షో టికెట్ల కోసం వి.కోటకు వెళ్లారు. యువకులు వేగంగా వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ వీరిని ఢీ కొట్టింది. రెండు బైక్ లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Road accident, West Godavari