స్కూల్ టాయిలెట్‌లో ఆరడుగుల తాచుపాము.. చూడగానే అదిరిపడ్డారు..

మొదట టాయిలెట్ నుంచి పాము శబ్దాలు వినిపించడంతో స్థానికులకు సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో టాయిలెట్ తలుపు తెరిచి చూడగా.. 10 అడుగుల ఎత్తులో ఉన్న వెంటిలేటర్ వద్ద తాచుపాము కనిపించింది.

news18-telugu
Updated: June 17, 2019, 10:37 AM IST
స్కూల్ టాయిలెట్‌లో ఆరడుగుల తాచుపాము.. చూడగానే అదిరిపడ్డారు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 17, 2019, 10:37 AM IST
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడులోనిఉర్దూ ప్రాథమిక పాఠశాలలో ఆరడుగుల ఓ తాచుపాము దూరింది. పాఠశాలలోని టాయిలెట్‌లోకి పాము దూరినట్టు తెలియడంతో కొద్దిసేపు విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. మొదట టాయిలెట్ నుంచి పాము శబ్దాలు వినిపించడంతో స్థానికులకు సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో టాయిలెట్ తలుపు తెరిచి చూడగా.. 10 అడుగుల ఎత్తులో ఉన్న వెంటిలేటర్ వద్ద తాచుపాము కనిపించడంతో అదిరిపడ్డారు.

అయితే అప్పటికీ సగం వరకు మాత్రమే లోపలికి దూరిన ఆ పాము.. పూర్తిగా లోపలకు ప్రవేశించేందుకు తంటాలు పడుతూ కనిపించింది. లావుగా ఉన్నందునా.. వెంటిలేటర్ రంధ్రాల్లో నుంచి అది దూరలేకపోయింది. చివరకు అటు బయటకు వెళ్లలేక..ఇటు లోపలికి రాలేక.. అక్కడే కొట్టుమిట్టాడుతూ చనిపోయింది. పాము విషయం తెలియగానే చుట్టుపక్కల జనం పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. అనంతరం దాన్నివెంటిలేటర్ నుంచి తొలగించినట్టు సమాచారం.

First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...