వాళ్లంతా కలిసి వైఎస్ వివేకానందరెడ్డిని చంపేశారా? ఫ్యాక్షన్ పగలే కారణమా?

YS Vivekananda Reddy Murder Case : కడపలో ఫ్యాక్షన్ ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులా ఉందా? ఫ్యాక్షన్ పగలే వివేకానంద రెడ్డిని చంపేశాయా?

Krishna Kumar N | news18-telugu
Updated: March 21, 2019, 7:04 AM IST
వాళ్లంతా కలిసి వైఎస్ వివేకానందరెడ్డిని చంపేశారా? ఫ్యాక్షన్ పగలే కారణమా?
వైఎస్ వివేకానంద రెడ్డి (File)
  • Share this:
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఇవాళ్టికి ఏడో రోజు. 15న తెల్లవారు జామున మర్డర్ జరిగింది. ఈ కేసును డీల్ చేస్తున్న సిట్ బృందానికి విషయం అర్థమైపోయిందని తెలిసింది. పాత కక్షలే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారణమని అర్థమవుతోంది. అవేంటో... తెరవెనక ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ కేసులో కిరాయి హంతకుడిగా చెప్పుకునే చంద్రశేఖర రెడ్డి పేరును మనం బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే... ఆ చంద్రశేఖర రెడ్డి... తన అనుచరులతో కలిసి... అత్యంత దారుణంగా వివేకానంద రెడ్డిని చంపేశారన్నది తాజాగా వెలుగులోకి వస్తున్న కథనం. సిట్ అధికారులు అధికారికంగా చెప్పకపోయినా... ఈ హత్య వెనక పెద్ద కథే ఉందని అర్థమవుతోంది. చంద్రశేఖర రెడ్డి... సింహాద్రిపురం మండలం, కతనూరుకి చెందిన వాడు. ఇదివరకు పులివెందులకు చెందిన రంగేశ్వర రెడ్డిని చంపిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. మరిన్ని ఇతర కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ చంద్రశేఖర రెడ్డి కుదురుగా ఉండకుండా... వివేకానంద రెడ్డికి దగ్గరి వాళ్లైన ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వర రెడ్డితో చేతులు కలిపాడని తెలుస్తోంది.

తాజాగా తేలిన అంశాల ప్రకారం... వివేకానందరెడ్డికీ, ఎర్ర గంగిరెడ్డికీ మధ్య ఏదో గొడవ జరిగింది. ఆ తర్వాత... ఎర్ర గంగిరెడ్డి... వివేకానంద రెడ్డికి శత్రువుగా చెప్పుకుంటున్న పరమేశ్వర రెడ్డితో చేతులు కలిపాడు. అంటే... వివేకాకు శత్రువులుగా మారిన ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వర రెడ్డీ, చంద్ర శేఖర రెడ్డి ఒక్కటయ్యారన్నమాట. హత్య కేసులో చంద్ర శేఖర రెడ్డి పాత్ర ఉంది అనేందుకు సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. ఎర్ర గంగిరెడ్డిని సిట్ అధికారులు బెంగళూరుకు తీసుకెళ్లారు. అక్కడ కొన్ని ఆధారాలు దొరికాయని సమాచారం.

6 నెలల కిందట రంగేశ్వర రెడ్డిని చంద్రశేఖర రెడ్డే చంపాడని పోలీసులు భావిస్తున్నారు. అప్పట్లో రంగేశ్వర రెడ్డిని చంద్రశేఖర రెడ్డి... వేట కొడవలితో వేటు వేసి చంపాడని భావించారు. అందుకు సంబంధించి అప్పట్లో చంద్రశేఖర రెడ్డిని అరెస్టు చేసి, వేట కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు వివేకానంద రెడ్డిని కూడా చంపింది వేట కొడవలితోనే అని తెలిసింది. రంగేశ్వర రెడ్డిని ఎలా చంపారో, సేమ్ అదే టైపులో వివేకానంద రెడ్డిని కూడా చంపారని పోలీసులు భావిస్తున్నారు. రెండు హత్యలూ ఒకేలా ఉండటంతో... అప్పటి హత్యలో నిందితుడిగా ఉన్న చంద్రశేఖర రెడ్డి... ఇప్పటి హత్య కూడా చేసి ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి.

రెండ్రోజుల కిందట తిరుపతిలో పరమేశ్వర రెడ్డితోపాటూ... అతని అనుచరులైన సునీల్ యాదవ్, మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు... బుధవారం మరో నలుగుర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వీళ్లందర్నీ ప్రశ్నించినప్పుడు ఎర్ర గంగిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పేర్లు వెలుగులోకి వచ్చాయి. అదే టైంలో పులివెందుల పొలాల్లో రక్తపు మరకలున్న వేట కొడవలి దొరికింది.

సో... ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వర రెడ్డీ ఒక్కటై... చంద్రశేఖర రెడ్డికి సుపారీ ఇచ్చి... వివేకానంద రెడ్డిని చంపించి ఉండొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. సిట్ అధికారులు మాత్రం ఈ దర్యాప్తుకి సంబంధించి ఒక్క ముక్క కూడా బయటకు చెప్పట్లేదు. ఇవన్నీ స్థానికంగా జరుగుతున్న ప్రచారాలు, అదుపులోకి తీసుకుంటున్న వ్యక్తుల్ని బట్టీ పోలీసులు వేస్తున్న అంచనాలే. వీలైనంత త్వరగా మిస్టరీకి చెక్ పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

 

ఇవి కూడా చదవండి :మేనిఫెస్టోలపై టీడీపీ, వైసీపీ దృష్టి... నేడు టీడీపీ మేనిఫెస్టో రిలీజ్... కీలక అంశాలు ఇవే...

నేడు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా రిలీజ్... టికెట్లు దక్కేది ఎవరికంటే...

వైఎస్ వివేకానంద రెడ్డిని కిరాయి హంతకులే చంపారా? సీబీఐ దర్యాప్తుకి హైకోర్టు ఆదేశిస్తుందా?

21న గాజువాకలో, 22న భీమవరంలో పవన్ కల్యాణ్ నామినేషన్... గెలిస్తే సీఎం అయ్యే ఛాన్స్
First published: March 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading