హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అమరావతి భూముల్లో అక్రమాలు.. ఏపీ సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్..

అమరావతి భూముల్లో అక్రమాలు.. ఏపీ సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

016లో రాజధాని ప్రాంతంలోని రావెల గోపాల కృష్ణ అనే వ్యక్తికి ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. అక్రమంగా భూములను బదలాయించినట్లు దర్యాప్తులో తేలడంతో బుధవారం రాత్రి మాధురిని అరెస్ట్ చేశారు.

    ఏపీ సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ మాధురిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్ట్ చేసింది. విజయవాడలోని తన నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. 2016లో రాజధాని ప్రాంతంలోని రావెల గోపాల కృష్ణ అనే వ్యక్తికి ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. అక్రమంగా భూములను బదలాయించినట్లు దర్యాప్తులో తేలడంతో బుధవారం రాత్రి మాధురిని అరెస్ట్ చేశారు. నెలక్రితం రావెల గోపాలకృష్ణను కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణలో ఆయన చెప్పిన వివరాల ఆధారంగా సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్‌ను కూడా అరెస్ట్ చేశారు. కాగా, ఏపీలో వైసీీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి భూములపై ప్రత్యేక దృష్టిపెట్టింది. చంద్రబాబునాయుడు హయంలో ఎన్నో అక్రమాలు జరిగాయని.. వాటిని బయటపెట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాజధాని భూములపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Amaravati, Andhra Pradesh, AP News, Crda

    ఉత్తమ కథలు