హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Simhachalam: సింహాచలంలో అపచారం.. సింహగిరిపై కూలిన సీతారామస్వామి ఆలయ ధ్వజస్తంభం

Simhachalam: సింహాచలంలో అపచారం.. సింహగిరిపై కూలిన సీతారామస్వామి ఆలయ ధ్వజస్తంభం

కూలిన ధ్వజస్తంభం

కూలిన ధ్వజస్తంభం

ఏపీలో హిందూ దేవాలయాలపై వివక్ష కొనసాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే.. మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అపచరాలు పెరుగుతున్నాయి. తాజాగా సింహాచలంలో ధ్వజస్తంభం కూలిన ఘటన కలకలం రేపుతోంది.

ఉత్తరాంధ్ర ఆరాధ్యం దైవం.. ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలోని అపచారం జరిగింది. సింహాచలం కొండపైనే ఉన్న ఉపాలయం శ్రీ సీతారామస్వామి సన్నిధిలోని ధ్వజస్తంభం కూలిపోయింది. ఇవాళ తెల్లవారుజామున అకస్మాత్తుగా ఆలయంలోని ధ్వజస్తంభం కూలడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే సీసీటీవీ పుటేజీ సహాయంతో కారణాలపై ఆరా తీశారు. ఎవరి ప్రమేయం లేదని నిర్ధాంచుకున్న తరువాత అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పురాతనమైన ఈ ధ్వజస్తంభం లోపలి భాగంలోని కర్ర పుచ్చిపోవడంతో.. అకస్మాత్తుగా కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం 6.30 గంటల సమయంలో జరిగినట్లు.. సీసీ టీవీ పుటేజీ పరిశీలన అనంతరం అధికారులు తెలిపారు. ఈ ఘటన తెలిసిన వెంటనే భక్తులు ధార్మిక సంఘాలు ప్రభుత్వం.. అధికారులు తీరుపై మండిపడ్డాయి. హిందూ దేవాలయలను గాలికి వదిలేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

తీవ్ర విమర్శల నేపథ్యం లో వెంటనే అప్రమత్తమైన అధికారుతు తరువాత వేదమంత్రాలు, సంప్రోక్షణ తరువాత తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ధ్వజస్తంభం ఏర్పాటు పనులు ప్రారంభించారు. పదిరోజుల్లో శాశ్వతంగా కొత్త ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తామని సింహాచల దేవస్థానం ఈవో సూర్యకళ అన్నారు. కూలిన ధ్వజస్తంభం 60 ఏళ్లకు చెందిందని.. లోపలి భాగంలోని కర్రకు చెదలు పట్టడంతో కూలిపోయినట్లు వివరించారు.


ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని ప్రఖ్యాత శ్రీముఖలింగం క్షేత్రం, సమీపంలోని కరకవలస వద్ద పద్మనాభ కోదండస్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఇక్కడి వినాయకుడు, సరస్వతి అమ్మవారు, మహిషాసుర మర్దని విగ్రహాలపై దాడులు చేశారు. ఏపీలో కొన్ని నెలల క్రితం సంచలనం సృష్టించిన హిందూ ఆలయాలు, విగ్రహాలపై దాడులు ఇటీవల కాలంలో నిలిచిపోయాయి అనుకుని ఆనంద పడుతున్న సమయంలో మళ్లీ ఘటనలు ఆందోళన పెంచుతున్నాయి. ప్రఖ్యాత శ్రీముఖలింగం క్షేత్రం, కరకవలస సమీపంలోని పద్మనాభ కోదండస్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసం ఘటన కలకలం రేపుతుండగా.. ఇప్పుడు సింహాచలంలోలో ధ్వజస్తంభం కూలిపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ‌ ఆలయాల విగ్రహాల ద్వంసం.. కూలిన ధ్వజస్తంభంపై రాజకీయ రంగు పులుముకుంటోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే విగ్రహాల ద్వంసం జరుగుతోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే హిందూ దేవాలయాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని భక్తులు సైతం మండిపడుతున్నారు. కరకవలస సమీపాన పద్మనాభకొండపై దుండగులు ధ్వంసం చేసిన విగ్రహాలను పరిశీలిస్తే అది కావాలనే ఎవరో చేసిన పనిలో ఉంది అంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam

ఉత్తమ కథలు