టీటీడీలో మరో కలకలం... వెండికిరీటం, బంగారం ఉంగరాలు మాయం

టీటీడీ ఏఈవో శ్రీనివాసులును బాధ్యునిగా చేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు.

news18-telugu
Updated: August 27, 2019, 11:43 AM IST
టీటీడీలో మరో కలకలం... వెండికిరీటం, బంగారం ఉంగరాలు మాయం
తిరుమల ఆభరణాలు ( నమూనా చిత్రం)
  • Share this:
టీటీడీలో మరోసారి కలకలం చెలరేగింది. ట్రెజరీలో ఉన్న 5 కిలోల వెండి కిరీటం, రెండు బంగారం ఉంగరాలు మాయమయ్యాయి. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి టీటీడీ ఏఈవో శ్రీనివాసులును బాధ్యునిగా చేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆభరణాల విలువను అతని జీతం రికవరీ చేయాలని ఆదేశించారు. అయితే శ్రీనివాసులుపై ఏకపక్షంగా చర్యలు తీసుకోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కఠిన చర్యలు తీసుకోకుండా కేవలం రికవరీ మాత్రమే చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

స్వామి వారికి నిత్యం అలంకరించే 290 ఆభరణాల్ని మినహాయిస్తే... మిగిలిన నగలన్నింటిని టీటీడీ ట్రెజరీలో భద్రపరుస్తుంది. అయితే ట్రెజరీలో 2012లో కూడా ఓ దొంగతనం జరిగింది. అక్కడ పనిచేసే ఓ ఉద్యోగి ట్రెజరీలో ఉన్న అమెరికన్ డైమండ్స్‌ను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. సీసీ కెమెరాలకు అడ్డంగా దొరకడంతో అప్పట్లో ఈవార్త టీటీడీలో సంచలనం సృష్టించింది, ఆ తర్వాత ట్రెజరీ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. అయితే పూర్తిస్థాయి భద్రత పెంచామన్నప్పటికీ మరోసారి శ్రీవారి నగలు మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. దీనికి బాద్యత వహిస్తూ అక్కడు పనిచేసే టీటీడీ ఏఈవో శ్రీనివాసులు జీతం నుంచి ప్రతీ నెల రూ. 30వేల రికవరీ చేస్తున్నారు. అయితే ఇప్పటిరవరకు అతనిజీతం నుంచి దాదాపు ఏడున్నర లక్షల వరకు రాబట్టినట్లు సమాచారం.

తాజాగా శ్రీవారి ఆలయంలో జరిగిన ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీటీడీ నిర్లక్ష్యంపై చర్యలకు సిద్ధమవుతున్నాయి. అవసరమైతే ఉన్నతాధికారులతో పాటు.. సీఎంకు అవసరమైతే రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామని చెబుతున్నాయి.టీటీడీ ఆర్థిక శాఖ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరిగిందని ఆరోపిస్తున్నారు.
First published: August 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading