విశాఖ ఉత్సవ్‌లో తప్పిన పెను ముప్పు

news18-telugu
Updated: December 29, 2019, 7:23 AM IST
విశాఖ ఉత్సవ్‌లో తప్పిన పెను ముప్పు
విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌..
  • Share this:
విశాఖపట్నంలో సాగరతీరాన శనివారం సీఎం వైఎస్ జగన్... విశాఖ ఉత్సవాలను ప్రారంభించారు. ఈకార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు, విశాఖ వాసులు తరలివచ్చారు. అయితే ఈ ఉత్సవ్‌లో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి 9.30 గంటలు సమయంలో ఉవ్వెత్తున ఎగసిన సముద్ర అలలు ఎగిసిపడ్డాయి. వేదిక ముందు ఏర్పాటు చేసిన వీఐపీ, వీవీఐపీ లాంజ్‌ల్లోకి అలలు ఎగిసిపడి నీళ్లు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా సందర్శకులు భయాందోళనలకు గురయ్యారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన లాంజ్‌లోకి నీరు ఒక్కసారిగా వచ్చింది. దీంతో అక్కడ ఉన్న విద్యుత్‌ తీగలు షార్ట్‌ సర్క్యూట్‌కు గురయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలుపదల చేశారు. అక్కుడున్న సందర్శకుల్ని, మిగతావారిని పక్కకు తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ ఒక్కసారిగా భారీ ఎత్తున అలలు ఎగిసి నీరు లోపలకు రావడంతో సందర్శకులు, అతిథులు, అధికారులు భయాందోళనలు గురయ్యారు.

First published: December 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు